AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay-Rashmika: సరిగ్గా 10:10 లకు విజయ్ దేవరకొండ- రష్మికల పెళ్లి.. ఈ ముహూర్తంకు అంత ప్రత్యేకత ఉందా?

టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఫిబ్రవరి 26వ తేదీన పెళ్లి పీటలెక్కారు. ఆ రోజున సరిగ్గా ఉదయం సరిగ్గా 10.10 గంటలకు రష్మిక మెడలో మూడు ముళ్లు వేశాడు విజయ్. ఇప్పుడు ఈ ముహూర్తంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Vijay-Rashmika: సరిగ్గా 10:10 లకు విజయ్ దేవరకొండ- రష్మికల పెళ్లి.. ఈ ముహూర్తంకు అంత ప్రత్యేకత ఉందా?
Wedding Of Virosh
Basha Shek
|

Updated on: Mar 07, 2026 | 8:07 PM

Share

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ వేదికగా వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఇద్దరూ వివాహం చేసుకోవడం ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభించారు విజయ్ – రష్మిక. అయితే ఫిబ్రవరి 26న ఉదయం సరిగ్గా 10:10 గంటలకు తమ పెళ్లి ముహూర్తాన్ని ఎంచుకున్నారీ విరోష్ జంట. ప్రస్తుతం ఈ ముహూర్తంపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలుగు, కొడవ సంప్రదాయాల ప్రకారం విజయ్- రష్మికల వివాహ వేడుక జరిగింది. సంప్రదాయ దుస్తులు, ఆచారాలు, కుటుంబ వాతావరణంలో జరిగిన విరోష్ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో వివాహ ముహూర్త సమయాన్ని 10:10 గంటలుగా ఎంచుకోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.

సాధారణంగా ప్రకటనలు లేదా షోరూమ్‌లలో గడియారాలను మనం పరిశీలిస్తే, అక్కడ సమయం చాలా వరకు 10:10 గంటలుగా ఉంటుంది. గడియారాలలో గంటల ముల్లు 10 వద్ద, నిమిషాల ముల్లు 2 వద్ద ఉంటుంది. కాబట్టి, ఈ సమయం కేవలం యాదృచ్చికమా లేదా దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. న్యూమరాలజిస్టుల ప్రకారం సంఖ్యాశాస్త్రంలో 10.10 కు ఒక ప్రత్యేకత ఉందట. చాలా మంది సంఖ్యా శాస్త్రవేత్తల ప్రకారం, ఈ సంఖ్య కొత్త ప్రారంభాలు, ప్రేమ, సానుకూల శక్తి, విజయానికి సంకేతంగా పరిగణిస్తారట. అలాగే 10. 10 ను ‘ఏంజిల్స్ నంబర్’ అని కూడా పిలుస్తారట. ఇది జీవితంలో ఆనందం, స్వచ్ఛత, మంచి అవకాశాలను సూచిస్తుందట. కొంతమంది సంఖ్యాశాస్త్రవేత్తల ప్రకారం, ఉదయం 10:00 గంటల నుంచి 10:20 గంటల మధ్య సమయం ‘లెకాబెల్’ అనే దేవదూతతో ముడిపడి ఉంటుందట. ఇది విజయం, భద్రత, కొత్త ప్రయత్నాలకు శుభప్రదంగా భావిస్తారు. అందువల్ల, చాలా మంది ఈ సమయాన్ని కొత్త ప్రయత్నాలను ప్రారంభించడానికి శుభప్రదంగా భావిస్తారట. ఈ క్రమంలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ తమ వివాహం కోసం 10:10 ముహూర్తాన్ని ఎంచుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఈ సమయాన్ని సానుకూల శక్తి, కొత్త ప్రారంభాలకు సంకేతంగా పరిగణిస్తారు. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ రష్మిక- విజయ్ దేవరకొండలు కలకాలం కలిసి ఉండాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

విజయ్- రష్మికల పెళ్లి ఫొటోలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
NEET 2026 ఫలితాల్లో హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంకు.. లింక్ ఇదే
NEET 2026 ఫలితాల్లో హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంకు.. లింక్ ఇదే
30 అడుగుల బావిలో పడిన మహిళ.. ఎలా బయటకు వచ్చిందంటే..
30 అడుగుల బావిలో పడిన మహిళ.. ఎలా బయటకు వచ్చిందంటే..
డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ముదురుతున్న వివాదం
డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ముదురుతున్న వివాదం
ముక్క ముట్టలేం.. గుడ్డు తినలేం.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
ముక్క ముట్టలేం.. గుడ్డు తినలేం.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
సచ్చుబడ్డ ఎముకలు కూడా బలంగా అవ్వాలంటే గుప్పెడు తింటే చాలు
సచ్చుబడ్డ ఎముకలు కూడా బలంగా అవ్వాలంటే గుప్పెడు తింటే చాలు
అనిరుద్ధ వినాయక చతుర్థి: రవి యోగంలో గణేశ పూజకు శుభ సమయం..
అనిరుద్ధ వినాయక చతుర్థి: రవి యోగంలో గణేశ పూజకు శుభ సమయం..
అల్పపీడనం ఎఫెక్ట్‌.. తెలుగురాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు
అల్పపీడనం ఎఫెక్ట్‌.. తెలుగురాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు
మీడియాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా జూలై 18 న ప్రెస్ మీట్ లో క్లారిటీ
మీడియాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా జూలై 18 న ప్రెస్ మీట్ లో క్లారిటీ
ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే సిమ్ ఎప్పటికీ యాక్టివ్‌లోనే..
ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే సిమ్ ఎప్పటికీ యాక్టివ్‌లోనే..
లాస్ట్ మ్యాచ్ లేకుండానే రోహిత్ రిటైర్మెంట్.. షాకిచ్చిన గంభీర్
లాస్ట్ మ్యాచ్ లేకుండానే రోహిత్ రిటైర్మెంట్.. షాకిచ్చిన గంభీర్