AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి టీజర్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి టీజర్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Ustaad Bhagat Singh
Rajeev Rayala
|

Updated on: Mar 07, 2026 | 8:35 PM

Share

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్ మెగాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

దీనికి తోడు ఈ మూవీలో పవన్ కల్యాణ్ హుషారైన స్టెప్పులు వేయనున్నట్లు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు.తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్ తో ఆకట్టుకున్నాడు. ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భగత్ గీత దమ్మున్నోడు దాటొచ్చు అంటూ పవన్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. మార్చ్ 19న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us