రోజూ పరగడుపున ఒక లవంగం తింటే ఇన్ని లాభాలా..?

07  march 2026

Jyothi Gadda

లవంగం.. విలువైన సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు. అనేక ఔషధ గుణాలతో కూడిన ఒక అద్భుతమైన పదార్థం. దీని ప్రత్యేక రుచి, సువాసన మాత్రమే కాకుండా దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

ఇందులో మాంగనీస్, విటమిన్ K, విటమిన్ C, ఫైబర్, అలాగే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ అయిన యూజెనోల్ పుష్కలంగా ఉంటాయి. యూజెనోల్ అనే పదార్థమే లవంగానికి ఔషధ గుణాలనిస్తుంది.

రోజూ ఉదయాన్నే లవంగం నమిలితే, నోటిలోని హానికర బ్యాక్టీరియా నశించి, దుర్వాసన తగ్గుతుంది. ఇది దంత నొప్పి, చిగుళ్ల వాపు, ఇతర నోటి ఇన్ఫెక్షన్లకు సహజ నివారణగా పనిచేస్తుంది. 

దీనివల్ల అజీర్తి, మలబద్ధకం, గ్యాస్, వికారం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉదయాన్నే లవంగాలు నమిలితే జీర్ణవ్యవస్థ రోజంతా చురుగ్గా ఉంటుంది.

లవంగాల్లో ఉండే విటమిన్ C , యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇవి జలుబు, దగ్గు, జ్వరం తగ్గుతుంది. శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని పెంచుతాయి.

లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాడు. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. అయితే.. డయాబెటిస్ ఉన్నవారు వైద్యుల సలహా మేరకు తినాలి. 

లవంగాల్లోని యూజెనోల్ సహజమైన నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. ఇది తలనొప్పి, దంత నొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

లవంగంలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించి, కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. అలాగే.. దీర్ఘకాలిక వాపును తగ్గించడంలో సహాయపడతాయి.