Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలో యాసిడ్‌తో ఎంట్రీ ఇచ్చిన ప్రియురాలు! ఆ తర్వాత ఏం జరిగిందంటే

మరికాసేపట్లో పెళ్లి. వధూవరులు, బంధు మిత్రులతో కల్యాణ మండపం కళకళలాడుతోంది. ఇంతలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగానీ ఓ యువతి అపర కాళిలా దూసుకొచ్చింది. నన్ను ప్రేమించి, మరో యువతిని పెళ్లి చేసుకుంటావా? అంటూ విరుచుకు పడింది. ఎలాగైనా ఆ పెళ్లి ఆపాలనే పక్కా ప్లాన్‌తో వచ్చిన సదరు యువతి తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌, కత్తితో నానా బీభత్సం..

Andhra Pradesh: మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలో యాసిడ్‌తో ఎంట్రీ ఇచ్చిన ప్రియురాలు! ఆ తర్వాత ఏం జరిగిందంటే
Acid Attack On Lover
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 12, 2024 | 11:41 AM

నందలూరు, ఆగస్టు 12: మరికాసేపట్లో పెళ్లి. వధూవరులు, బంధు మిత్రులతో కల్యాణ మండపం కళకళలాడుతోంది. ఇంతలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగానీ ఓ యువతి అపర కాళిలా దూసుకొచ్చింది. నన్ను ప్రేమించి, మరో యువతిని పెళ్లి చేసుకుంటావా? అంటూ విరుచుకు పడింది. ఎలాగైనా ఆ పెళ్లి ఆపాలనే పక్కా ప్లాన్‌తో వచ్చిన సదరు యువతి తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌, కత్తితో నానా బీభత్సం సృష్టించింది. దీంతో పెళ్లి మండపం కాసేపట్లోనే రణరంగంగా మారింది. బంధు జనమంతా అరుపులు, కేకలతో తలోదిక్కు పరుగులంకించుకున్నారు. ఏ జరుగుతుందో అర్థమయ్యే లోపు పచ్చని పందిట్లో నెత్తురు చిందింది. ఈ షాకింగ్‌ సంఘటన అన్నమయ్య జిల్లా నందలూరులో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్‌ బాషాకు ఓ యువతితో నందలూరులో వివాహం జరుగుతుంది. ఇంతలో తిరుపతికి చెందిన మరో యువతి తనతో పదేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకున్న బాషా కొద్ది రోజులుగా కనిపించకుండా పోవడంతో వెతుక్కుంటూ రైల్వే కోడూరుకు వచ్చి ఆరా తీసింది. ఈ క్రమంలో తన ప్రియుడికి వేరే యువతితో పెళ్లి జరుగుతుందన్న వార్త చెవిన పడటంతో శివంగిలా రగిలిపోయింది. నేరుగా నందలూరులోని పెళ్లి మండపానికి చేరుకుంది. తనను మోసం చేసిన విషయంపై వరుడిని నిలదీసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌, కత్తితో యువతి బాషాపై దాడికి యత్నించింది. అక్కడే ఉన్న బంధువులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయగా తోపులాటలో వరుడి పక్కనే ఉన్న కరిష్మా అనే మహిళ ముఖంపై యాసిడ్‌ పడి గాయాలయ్యాయి.

ఈ ఘటనతో ఆగ్రహించిన బాషా.. ప్రియురాలి చేతిలో కత్తి లాక్కుని ఆమె వీపు, భుజంపై బలంగా పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన ప్రియురాలితోపాటు యాసిడ్‌ పడిన యువతిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు ప్రాణాపాయం లేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వ్యవహారం పోలీస్‌ స్టేషన్‌కు ఎక్కడంతో అక్కడ పంచాయితీ కొనసాగుతుంది. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. ఇదిలా ఉంటే వరుడి ప్రియురాలు మీడియాతో మాట్లాడకుండా ఆమెను పోలీసులు ఓ గదిలో నిర్బంధించడం చర్చణీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.