Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: టీటీడీ ప్రాణదాన ట్రస్ట్‌కు భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..!

దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం అందింది. స్వామివారి సేవలో తరలించిన ఓ భక్తుడు తన ఫ్యామిలీ తో కలిసి . ఈ క్రమంలో ఆ భక్తుడు శ్రీవారికి భూరి విరాళం అందించారు. ఒక్కరోజే రూ.21 కోట్ల భారీ విరాళం తిరుమల దేవస్థానానికి అందింది. ఇంత భారీ మొత్తంలో ఒకే రోజు టీటీడీకి విరాళం రావడం చాలా నెలల తర్వాత అని అంటున్నారు.

TTD: టీటీడీ ప్రాణదాన ట్రస్ట్‌కు భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..!
Tirumala Tirupati Donation
Follow us
Surya Kala

|

Updated on: Aug 12, 2024 | 9:41 AM

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామీ కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. కలియుగ వైకుంఠంగా ప్రసిద్ది గాంచిన తిరుమలలోని వెంకటేశ్వరుడి దివ్య సన్నిధానం చేరుకోవాలని.. శ్రీవారిని దర్శించుకుని తరించాలని ప్రతి హిందువు కోరుకుంటారు. నిర్మలమైన మనసుతో కొలిచినా… స్వామీ మమ్ము కరుణించి కటాక్షించు అంటూ వేడుకునే భక్తుల కష్టాలను తీర్చే దైవం కోనేటి రాయుడు. ఆహ్లాదకరమైన వాతావరణం అణువణువునా కనిపించే తిరుమల తిరుపతి క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో ఉంటుంది. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడానికి రాజకీయనేతలు, సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ తిరుమల తిరుపతి క్షేత్రానికి పోటెత్తుతారు. దేశాన్ని ఏలిన నాటి రాజుల నుంచి నేటి వరకూ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. స్వామివారిని భక్తులు సేవించి నగలు, నగదు, భూములు ఇలా రకరకాల విలువైన సంపదను భూరి విరాళాలు ఇచ్చారు. ఆ సంప్రదాయం నేటికీ భక్తులు కొనసాగిస్తూ.. ఆపద మొక్కుల వాడికి తమ శక్తి కొలది బంగారు, నగదు, భూమి వంటి కానుకలను అందజేస్తున్నారు. తాజాగా దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం అందింది. స్వామివారి సేవలో తరలించిన ఓ భక్తుడు తన ఫ్యామిలీ తో కలిసి . ఈ క్రమంలో ఆ భక్తుడు శ్రీవారికి భూరి విరాళం అందించారు. ఒక్కరోజే రూ.21 కోట్ల భారీ విరాళం తిరుమల దేవస్థానానికి అందింది. ఇంత భారీ మొత్తంలో ఒకే రోజు టీటీడీకి విరాళం రావడం చాలా నెలల తర్వాత అని అంటున్నారు.

టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.21 కోట్ల భారీ విరాళం అందించారు పంజాబ్‌లోని ట్రైడెంట్ గ్రూప్‌కు చెందిన రాజిందర్ గుప్తా. ఈ విరాళం చెక్కును దాతలు టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సి వెంకయ్య చౌదరికి అందించారు. భారీ మొత్తంలో విరాళం అందించిన రాజిందర్‌ గుప్తా కుటుంబసభ్యులను టీటీడీ అధికారులు సన్మానించారు. శ్రీవారి జ్ఞాపికలు అందించారు. విరాళం అందించడానికి ముందు రాజిందర్‌ గుప్తా కుటుంబసభ్యులు శ్రీవారిని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. స్వామీ తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం టీటీడీ ఏఈఓ కార్యాలయానికి చేరుకుని విరాలానికి చెందిన చెక్కును అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..