AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శివుయ్య జలాభిషేకం కోసం ఎగబడిన భక్తులు.. తొక్కిసలాట .. ఏడుగురు భక్తులు మృతి, 12 మందికి గాయాలు

ఈ ప్రమాదంలో గాయపడిన ఆనంద్‌కుమార్‌ అలియాస్‌ విశాల్‌ మాట్లాడుతూ.. రాత్రి 1 గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. ఆ సమయంలో గుడిలో జలాభిషేకం నిర్వహించడానికి భారీ సంఖ్యలో భక్తులు ఉన్నారని చెప్పారు. అయితే శివయ్యకు ముందు జలాభిషేకం చేయాలనే ఆరాటంలో భక్తులు తోపులాట ప్రారంభించారని చెప్పారు. అయితే కొద్దిసేపటికే ఈ గొడవ తొక్కిసలాటగా మారింది

శివుయ్య జలాభిషేకం కోసం ఎగబడిన భక్తులు.. తొక్కిసలాట .. ఏడుగురు భక్తులు మృతి, 12 మందికి గాయాలు
Lord Shiva Temple
Surya Kala
|

Updated on: Aug 12, 2024 | 10:57 AM

Share

ఉత్తారాది వారు శ్రావణ మాసం శివయ్యను పూజించడానికి విశిష్టమైన మాసంగా పరిగనిస్తారు. దీంతో శ్రావణ సోమవారాలు శివాలయాలకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకొని శివయ్యకు అభిషేకం నిర్వహిస్తారు. దీంతో శివాలయాలలో భక్తుల రద్దీ నెలకొంటుంది. శ్రావణ సోమవారం సందర్భంగా బీహార్‌లోని జెహనాబాద్‌లో శివుని జలాభిషేకం సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ కారణంగా పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో 12 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. వీరిలో చాలా మంది భక్తుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జెహనాబాద్‌లోని మఖ్దుంపూర్‌లోని వనవర్ బాబా సిద్ధేశ్వరనాథ్ ఆలయంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వివిధ ఆస్పత్రుల్లో చేర్పించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ భక్తులందరూ శివుడికి జలాభిషేకం కోసం సోమవారం ఆలయంలో తరలివచ్చారు. అయితే ఆలయంలో తొక్కిసలాట ఎలా జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే ఎస్పీ, డీఎం స్వయంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు జెహనాబాద్ ఎస్‌హెచ్‌ఓ దివాకర్ విశ్వకర్మ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం జలాభిషేకం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తుందని.. అయితే ఈ అంశంపై తగు విచారణ జరుపుతున్నారు.

సిద్ధేశ్వరనాథ్ ఆలయం జెహనాబాద్

ఇవి కూడా చదవండి

ఈ ప్రమాదంలో గాయపడిన ఆనంద్‌కుమార్‌ అలియాస్‌ విశాల్‌ మాట్లాడుతూ.. రాత్రి 1 గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. ఆ సమయంలో గుడిలో జలాభిషేకం నిర్వహించడానికి భారీ సంఖ్యలో భక్తులు ఉన్నారని చెప్పారు. అయితే శివయ్యకు ముందు జలాభిషేకం చేయాలనే ఆరాటంలో భక్తులు తోపులాట ప్రారంభించారని చెప్పారు. అయితే కొద్దిసేపటికే ఈ గొడవ తొక్కిసలాటగా మారింది. అలాంటి పరిస్థితిలో బయటికి వెళ్లిన వారు సురక్షితంగా ఉన్నారు. ఆలయం లోపల చిక్కుకున్నవారికీ తాము ఎలా అక్కడ నుంచి బయటపడాలో తెలియక పోవడంతో పరిస్థితి మరింత దిగజారిందని చెప్పారు. తొక్కిసలాట నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు తప్పింది.

రాత్రి 10 గంటల నుంచి క్యూ కట్టడం మొదలైంది

గాయపడిన ఇతర వ్యక్తులు మాట్లాడుతూ ఈ ఆలయంలో సంవత్సరంలో 365 రోజులు భక్తుల రద్దీ ఉన్నప్పటికీ.. శ్రావణ మాసంలో ఈ రద్దీ మరింత పెరుగుతుంది. ముఖ్యంగా సోమవారాల్లో ఆలయంలో శివయ్యకు జలాభిషేకం చేసేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి క్యూ కడతారు. ఈసారి కూడా శ్రావణ సోమవారం కనుక శివయ్య జలాభిషేకానికి ఆదివారం రాత్రి 10 గంటల నుండి క్యూ ఏర్పడటం ప్రారంభమైంది. 12.30 తర్వాత జనం శివలింగం వైపు వెళ్లడం ప్రారంభించారు. ఇంతలో తొక్కిసలాట జరిగి ఈ ప్రమాదం జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పాలు విరిగిపోకుండా పక్కా కొలతలతో చేసే కమ్మనైన పాల తాలికలు
పాలు విరిగిపోకుండా పక్కా కొలతలతో చేసే కమ్మనైన పాల తాలికలు
వంట గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే ఇలా చేయండి..
వంట గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే ఇలా చేయండి..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్
పంత్ గాయంపై క్లారిటీ.. జైస్వాల్ గొడవపై కోచ్ ఏమన్నారంటే..?
పంత్ గాయంపై క్లారిటీ.. జైస్వాల్ గొడవపై కోచ్ ఏమన్నారంటే..?
భారత ఉపరాష్ట్రపతి మెచ్చిన వాసెన పోళి
భారత ఉపరాష్ట్రపతి మెచ్చిన వాసెన పోళి
లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ 7 వస్తువులు ఇంట్లో ఉన్నాయా?
లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ 7 వస్తువులు ఇంట్లో ఉన్నాయా?
పాక్‌ పై చక్కర్లు కొట్టిన టర్కీ యుద్ధ విమానాలు.. ఏం జరుగుతోంది?
పాక్‌ పై చక్కర్లు కొట్టిన టర్కీ యుద్ధ విమానాలు.. ఏం జరుగుతోంది?
చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం చెప్తోందిదే
చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం చెప్తోందిదే
చెప్పకుండా కారు దిగిన బుడ్డోడు.. చూసుకోకుండా వెళ్లిపోయిన తండ్రి
చెప్పకుండా కారు దిగిన బుడ్డోడు.. చూసుకోకుండా వెళ్లిపోయిన తండ్రి
ఇంట్లో వైఫై సరిగ్గా రావడం లేదా..? ఈ మూడు ట్రిక్స్ చాలు..
ఇంట్లో వైఫై సరిగ్గా రావడం లేదా..? ఈ మూడు ట్రిక్స్ చాలు..