Independence Day 2024: ఆగస్ట్ 15న భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని ఎవరు నిర్ణయించారు? ఈ తేదీకి జపాన్‌తో సంబంధం ఏమిటంటే?

1945 జూలైలో బ్రిటన్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విన్‌స్టన్ చర్చిల్‌ను ఓడించి క్లెమెంట్ అట్లీ ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అయిన తర్వాత అట్లీ ఫిబ్రవరి 1947లో భారతదేశానికి 30 జూన్ 1948లోపు స్వాతంత్ర్యం ఇవ్వనున్నామని ప్రకటించారు. అంటే బ్రిటిష్ వారికి భారతదేశాన్ని విముక్తి చేయడానికి 1948 జూన్ 30 వరకు సమయం ఉంది.

Independence Day 2024: ఆగస్ట్ 15న భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని ఎవరు నిర్ణయించారు? ఈ తేదీకి జపాన్‌తో సంబంధం ఏమిటంటే?
Independence Day 2024
Follow us

|

Updated on: Aug 14, 2024 | 11:30 AM

ఆగస్టు 15 పిల్లల, పెద్దల పండగ.. కులమతం అనే తేడా లేకుండా ప్రతి భారతీయుడు జరుపుకునే పండగ భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం. దేశమంతటా ఈ రోజున స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటారు. ఎర్రకోటపై ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా ఈ తేదీన గొప్ప వైభవంగా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఎందుకంటే 1947 సంవత్సరంలో ఈ రోజున భారతదేశానికి అధికారికంగా స్వాతంత్ర్యం వచ్చింది. ఈసారి కూడా స్వాతంత్య్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఇంటి వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు భారతీయులు రెడీ అవుతున్నారు. అయితే తమ పాలన నుంచి భారతదేశానికి విముక్తి ఇవ్వడానికి బ్రిటిష్ వారు ఆగస్టు 15ని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్న తలెత్తుతుంది. అంతేకాదు ఈ తేదీకి జపాన్‌కి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా..!

దేశ విముక్తి కోసం స్వాతంత్ర్య సమరయోధులు ఎన్నో త్యాగాలు చేశారు. బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలను తిన్నారు.. బుల్లెట్లకు ఎదురు వెళ్లారు. బహిరంగంగా ఉరి తాడుని ముద్దాడారు కూడా.. దీంతో బ్రిటన్ పై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో 1945 జూలైలో బ్రిటన్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విన్‌స్టన్ చర్చిల్‌ను ఓడించి క్లెమెంట్ అట్లీ ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అయిన తర్వాత అట్లీ ఫిబ్రవరి 1947లో భారతదేశానికి 30 జూన్ 1948లోపు స్వాతంత్ర్యం ఇవ్వనున్నామని ప్రకటించారు. అంటే బ్రిటిష్ వారికి భారతదేశాన్ని విముక్తి చేయడానికి 1948 జూన్ 30 వరకు సమయం ఉంది.

అందుకే ముందుగా విముక్తి చేయాలని నిర్ణయించారు

ఇవి కూడా చదవండి

ప్రకటన సమయంలో భారతదేశం-పాకిస్తాన్ విభజన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మొహమ్మద్ అలీ జిన్నా లకు పెద్ద సమస్యగా మారింది. ముస్లింల కోసం ప్రత్యేక దేశమైన పాకిస్తాన్ కోసం జిన్నా డిమాండ్ చేయడం వల్ల ప్రజల్లో మత ఘర్షణల భయం పెరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, బ్రిటీష్ పాలకులు 1947 ఆగస్టు 15న భారతదేశాన్ని విముక్తి చేయాలని నిర్ణయించారు.

స్వాతంత్ర్యం ఇవ్వడానికి ప్రణాళిక వేసుకున్న మౌంట్ బాటన్

క్లెమెంట్ అట్లీ భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించాడు. అయితే బ్రిటన్‌లోభారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చే చట్టం చేయాల్సిన అవసరం ఉంది. దీని కోసం చట్టం చేసే బాధ్యతను అప్పటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ కు అప్పగించారు. మౌంట్ బాటన్ జూన్ 3, 1947న భారతదేశ స్వాతంత్ర్య ప్రణాళికను సమర్పించారు. దీనిని మౌంట్ బాటన్ ప్లాన్ అని కూడా అంటారు. ఈ ప్రణాళిక ప్రకారం స్వాతంత్ర్యం ఇవ్వడంతో పాటు, భారతదేశం రెండు భాగాలుగా విభజించబడింది. ఈ ప్రణాళిక ప్రకారం ముస్లింల కోసం కొత్త దేశం పాకిస్థాన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది.

మౌంట్ బాటన్ ప్రణాళిక ఆధారంగా భారత స్వాతంత్ర్య చట్టం తయారు చేయబడింది. ఇది జూలై 5, 1947న బ్రిటిష్ పార్లమెంట్ (బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్)చే ఆమోదించబడింది. దీని తరువాత జూలై 18, 1947 న, బ్రిటన్ రాజు జార్జ్ VI కూడా ఈ చట్టానికి తన ఆమోదం తెలిపాడు. దీని తర్వాత భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది.

ఈ రోజు మౌంట్‌బాటన్‌కు ప్రత్యేకమైనది

చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ జీవితంలో ఈ రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నందున భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి ఆగస్టు 15వ తేదీని ఎంచుకున్నారు. వాస్తవానికి రెండవ ప్రపంచ యుద్ధంలో ఆగష్టు 15, 1945 న జపాన్ సైన్యం బ్రిటన్ సహా మిత్రరాజ్యాల దేశాలకు లొంగిపోయింది. అదే రోజు జపాన్ చక్రవర్తి హిరోహిటో రికార్డ్ చేసిన రేడియో సందేశాన్ని విడుదల చేశాడు. అందులో అతను మిత్రరాజ్యాలకు లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. లార్డ్ మౌంట్ బాటన్ అప్పుడు బ్రిటీష్ ఆర్మీలో మిత్రరాజ్యాల దళాలకు కమాండర్. అందువల్ల, జపాన్ సైన్యం లొంగిపోయినందుకు మొత్తం క్రెడిట్ మౌంట్ బాటన్‌కు ఇవ్వబడింది. అందువల్ల అతను ఆగస్టు 15వ తేదీని తన జీవితంలో ఉత్తమమైన, పవిత్రమైన రోజుగా భావించాడు. అందుకే భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి ఆగస్టు 15వ తేదీని ఎంచుకున్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ