- Telugu News Photo Gallery Spiritual photos Venus Mercury Conjunction: Financial and Family Woes for these zodiac signs
Zodiac Signs: శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
సాధారణంగా శుక్ర, బుధులు కలవడం చాలా మంచిదని, ఇది శుభ యోగాలనిస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెబుతుంటారు. అయితే, ఇవి రెండూ దుస్థానాల్లో యుతి చెందడం మాత్రం కొన్ని కష్ట నష్టాలను కలిగించే అవకాశం ఉంది. ఈ గ్రహాలు 1, 3, 6, 8, 12 స్థానాల్లో కలవడం వల్ల ధన నష్టానికి, కుటుంబ సమస్యలకు, నమ్మక ద్రోహానికి కారణమయ్యే అవకాశం ఉంది. బంధు మిత్రులు దూరం కావడం, మిత్రులు శత్రువులుగా మారడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ఈ నెల(డిసెంబర్) 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వృశ్చికంలో కలుస్తున్న ఈ రెండు గ్రహాల యుతి వల్ల మేషం, మిథునం, కన్య, వృశ్చికం, ధనూ రాశివారికి కొద్దిపాటి కష్టనష్టాలు తప్పకపోవచ్చు.
Updated on: Dec 05, 2025 | 5:23 PM

మేషం: ఈ రాశికి అష్టమ స్థానంలో శుక్ర, బుధుల కలయిక వల్ల ఈ రాశివారికి వైవాహిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగస్వామిలో ఆధిపత్య ధోరణి పెరుగుతుంది. దంపతుల మధ్య తరచూ కీచులాటలు, వాదోపవాదాలు తప్పకపోవచ్చు. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల జోక్యం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక నిర్వహణ బాధ్యతలను ఇతరులకు అప్పగించడం వల్ల నష్టపోతారు. డబ్బు తీసుకున్నవారి తిరిగివ్వడం జరగదు. బంధుమిత్రుల మీద వృథా ఖర్చులు పెరుగుతాయి.

మిథునం: ఈ రాశికి ఆరవ స్థానంలో రాశ్యధిపతి బుధుడు శుక్రుడితో కలవడం వల్ల ఈ రాశివారి కష్టార్జితం చేతిలో మిగిలే అవకాశం ఉండదు. వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి. విలాసాల మీదా,మిత్రుల మీదా అనవసర వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మోసపోవడం, నష్టపోవడం వంటివి ఎక్కువగా ఉంటాయి. నష్టదాయక వ్యవహారాల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయి.

కన్య: ఈ రాశికి తృతీయ స్థానంలో రాశ్యధిపతి బుధుడు, ధనాధిపతి శుక్రుడు యుతి చెందడం వల్ల ఈ రాశివారికి ఆదాయాన్ని మించి ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ ప్రయత్నాలు ఒక పట్టాన ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ప్రయాణాలలో విలువైన వస్తువులు, నగదును కోల్పోయే అవకాశం ఉంది. అనారోగ్యాల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు నష్టం కలిగిస్తాయి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం బాగా ఇబ్బంది పెడతాయి. మిత్రుల వల్ల ధన నష్టం కలుగుతుంది.

వృశ్చికం: ఈ రాశిలో శుక్ర, బుధుల సంచారం వల్ల ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యసనాలు, విలాసాల మీదా, అనవసర పరిచయాల మీదా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో పొరపాట్లు చేసే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు ఏమంత లాభించకపోవచ్చు. ఏ ప్రయత్నం తలపెట్టినా వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ ఖర్చులు కూడా అదుపు తప్పుతాయి. మిత్రులు తప్పుదోవ పట్టిస్తారు.

ధనుస్సు:ఈ రాశికి వ్యయ స్థానంలో శుక్ర, బుధుల సంచారం వల్ల ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో బాగా నష్టపోయే అవకాశం ఉంది. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టాలకు గురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయి. ఆస్తి, ఆర్థిక సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరగకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల నష్టాలు కలుగుతాయి. వైద్య ఖర్చులు బాగా పెరుగుతాయి.



