కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్ సేవలు.. ఇకపై
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం ఆన్‌లైన్ సేవలను ప్రారంభించింది. భక్తులు సులభంగా దర్శన టిక్కెట్లు, ఆర్జిత సేవలు, ప్రసాదాలు, వసతిని వెబ్‌సైట్ లేదా వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. దళారుల ప్రమేయం లేకుండా పారదర్శక సేవలు అందించడమే లక్ష్యం. ఇది దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఎంతో సౌలభ్యాన్ని కల్పిస్తుంది.
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఆన్ లైన్ సేవలు ప్రారంభమయ్యాయి. స్వయంభుగా వెలసిన వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని రోజుకు 17 నుంచి 20వేల మంది భక్తులు దర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు దేవస్థానంలో జరిగే ఆర్జిత సేవలు, వసతి సదుపాయాలుతోపాటు తీర్థప్రసాదాలు తీసుకోవడంలో అవస్థలు పడుతుంటారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు దేవాదాయ శాఖ ఆన్ లైన్ సేవలను ప్రారంభించింది. ఆన్ లైన్ ద్వారా స్వామివారి దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు ప్రసాదాలు వసతి బుకింగ్ సదుపాయాలను దేవస్థానం అందుబాటులోకి తెచ్చింది. వెబ్ సైట్ ద్వారా గాని వాట్సప్ ద్వారా గాని ఈ సేవలను పొందేందుకు అవకాశం కల్పించింది. స్వామివారి గర్భాలయంలో మూలమూర్తికి జరిగే నిత్య సేవలను సైతం భక్తులకు దేవస్థానం ఆన్ లైన్ విధానం ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం ద్వారా దేవస్థానంలో జరిగే అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వెయ్యొచ్చని అధికార యంత్రాంగం భావిస్తోంది. దీంతో దళారుల ప్రమేయం లేకుండా భక్తులు నేరుగా స్వామి వారి సేవలు పొందేందుకు ఆన్ లైన్ సేవలు ఉపయోగపడనున్నాయి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి జరిగే విశేష కార్యక్రమాలు నిత్య కళ్యాణోత్సవం, మోదక పూజ, శ్రీ గణపతి హోమం, ఊంజల సేవ, శ్రీ సంకటహర గణపతి పూజ కార్యక్రమాలను కూడా దేవస్థానం ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. స్వామివారి సేవలు ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవతో మొదలై రాత్రి పవళింపు, కవాటబంధనం సేవతో ముగుస్తాయి. భక్తుల సౌకర్యార్థం స్వామివారి దర్శనాలు, సేవలు ప్రసాదాలు, వసతి బుకింగ్ ఆన్ లైన్, వాట్సప్ ద్వారా భక్తులు పొందవచ్చు. దేవస్థానం అధికారిక వెబ్సైట్ https://www.srikanipakadevasathanam.org ద్వారా భక్తులు పొందవచ్చు. అలాగే దేవస్థానం అధికార వాట్సాప్ నెంబర్..9552300009 నుంచి కూడా వినియోగించుకోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
మొన్న ప్రభాస్.. నిన్న చరణ్.. నేడు అల్లు అర్జున్.. అందరి టార్గెట్ ఆ దేశమే
రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. విషయం తెలిస్తే ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిందే
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

