రాష్ట్రపతి విందుకు రాహుల్, ఖర్గేలకు అందని ఆహ్వానం.. కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు సంబంధించి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఈ విందుకు ఆహ్వానం అందలేదు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌కు మాత్రం రాష్ట్రపతి భవన్ నుండి విందుకు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానం వెనుక ఉన్న కారణాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు సంబంధించి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఈ విందుకు ఆహ్వానం అందలేదు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌కు మాత్రం రాష్ట్రపతి భవన్ నుండి విందుకు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
థరూర్ ఏమన్నారంటే..?
గత ఆరు నెలలుగా పార్టీతో తన సంబంధం అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, శశి థరూర్ విందుకు హాజరవుతున్నట్లు తెలిపారు. దీనిపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ అధిపతిగా తనకు దక్కిన మర్యాదగా ఈ ఆహ్వానాన్ని పరిగణిస్తున్నానని అన్నారు. రాహుల్, ఖర్గేలకు ఆహ్వానం అందకపోవడంపై థరూర్ స్పందించారు. విందు ఇన్విటేషన్ల కోసం అనుసరించిన ప్రక్రియ గురించి తనకు తెలియదని వ్యాఖ్యానించారు.
రాహుల్ విమర్శలు
మరోవైపు ఇటీవలే మోడీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. విదేశాధినేతలను కలిసే విషయంలో ప్రభుత్వం పాత సంప్రదాయాలను విస్మరిస్తోందని ఆరోపించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విదేశీ నేతలు వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతలతోనూ సమావేశమయ్యేలా చర్యలు తీసుకున్నారని రాహుల్ గుర్తు చేశారు. కానీ మోడీ సర్కార్ వాటన్నింటికి పక్కనబెట్టిందని మండిపడ్డారు.
ప్రోటోకాల్ ఉల్లంఘనపై చర్చ
సాధారణంగా రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక విందులకు ఆహ్వానాలు పంపడంలో ప్రభుత్వం లేదా రాష్ట్రపతి కార్యాలయం కొన్ని ప్రోటోకాల్‌లను పాటిస్తుంది.ముఖ్యంగా విదేశీ ప్రముఖులు పాల్గొనే లేదా ప్రత్యేక సందర్భాలలో జరిగే విందులకు, పార్టీలకు అతీతంగా మేధావులు, విభిన్న రంగాల నిపుణులను ఆహ్వానించడం ఆనవాయితీగా ఉంది.ఈ నేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయినప్పటికీ రాహుల్ గాంధీకి, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లిఖార్జున ఖర్గేకు ఆహ్వానం అందకపోవడంపై ప్రతిపక్ష వర్గాల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




