AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఎంబీఏ చదివి ఇదేం పనిరా..? ఏకంగా మహిళా పోలీస్‌కే మస్కా కొట్టారు.. చివరకు..

గత ఏడాది అక్టోబర్ 29న బాపట్ల జిల్లా కర్లపాలంలోని అయ్యప్ప స్వామి గుడి వద్దకు సచివాలయంలో మహిళా పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న కర్రి లక్ష్మీ ప్రసన్న వచ్చారు. ఆమె వస్తున్న విషయాన్ని గమనించిన ఇద్దరూ యువకులు బైక్ పై వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసు తెంచుకుని బుద్దాం వైపు వెళ్లిపోయారు. దీంతో మహిళా పోలీస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Andhra: ఎంబీఏ చదివి ఇదేం పనిరా..? ఏకంగా మహిళా పోలీస్‌కే మస్కా కొట్టారు.. చివరకు..
Guntur Police
T Nagaraju
| Edited By: |

Updated on: Mar 03, 2026 | 6:45 PM

Share

గత ఏడాది అక్టోబర్ 29న బాపట్ల జిల్లా కర్లపాలంలోని అయ్యప్ప స్వామి గుడి వద్దకు సచివాలయంలో మహిళా పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న కర్రి లక్ష్మీ ప్రసన్న వచ్చారు. ఆమె వస్తున్న విషయాన్ని గమనించిన ఇద్దరూ యువకులు బైక్ పై వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసు తెంచుకుని బుద్దాం వైపు వెళ్లిపోయారు. దీంతో మహిళా పోలీస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుండి ఈ చెయిన్ స్నాచర్స్ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన పట్నాల వెంకట దుర్గా ప్రభు అఖిల్ ఎంబిఏ చదువుకున్నాడు. జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈజీగా మనీ సంపాదించాలనుకొని చోరీలకు పాల్పడుతున్నాడు.

అఖిల్ శారదా కాలనీకి చెందిన రజాక్ తో జతకట్టాడు. ఇద్దరూ కలిసే దొంగతనాలు చేస్తున్నారు. అఖిల్ ఫిరంగిపురంలో జిమ్ నిర్వహిస్తున్నాడు. ఇద్దరూ కలిసి బైక్స్ పై ప్రయాణం చేస్తూ చెయిన్ స్నాచింగ్ లు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కర్లపాలెం, నర్సరావుపేట, అద్దంకి, పొన్నూరు ప్రాంతాలలో స్నాచింగ్ చేసినట్లు పోలీసులు తేల్చారు.

అయితే పలు ప్రాంతాల్లో చోరి చేసిన పోలీసులకు దొరక్కుండా తప్పించుకుపోవటం వీరికి వెన్నతో పెట్టిన విద్య.. గత ఏడాది మహిళా పోలీస్ చెయిన్ స్నాచింగ్ కు గురైన తర్వాత డిఎస్పీ జగదీష్ నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి చెయిన్ స్నాచెర్స్ పై దృష్టి పెట్టారు. అప్పటి నుండి అఖిల్, రజాక్ కోసం వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సాంకేతికత ఉపయోగించి వీరిద్దరే చెయిన్ స్నాచింగ్స్ కు పాల్పడుతున్నట్లు ఆధారాలు సేకరించారు. నిన్న కర్లపాలెం మండలం నల్లమోతు వారిపాలెం వద్ద టీ త్రాగుతున్న వీరిద్దరిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.

వీరి వద్ద నుండి 130 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. చెయిన్ స్నాచర్స్ ను పట్టుకున్న పోలీసులను బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ అభినందించారు. ప్రతిభ కనబరిచిన పోలీసులకు రివార్డులు అందించారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us