Andhra: మస్కిటో కాయిల్ అంటుకొని చనిపోయాడా..? అర్థరాత్రి ఇంకేమైనా జరిగిందా..
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడిలో ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మస్కిటో (దోమల కాయిల్) కాయిల్ అంటుకొని చనిపోయినట్లు పేర్కొంటున్నారు. అయితే.. స్థానికులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడిలో ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మస్కిటో (దోమల కాయిల్) కాయిల్ అంటుకొని చనిపోయినట్లు పేర్కొంటున్నారు. అయితే.. స్థానికులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. నాగేశ్వరరావు, రాజ్యం దంపతులు కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె సారికా రాణి ..రాణికి వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. భర్తతో విబేధాలు రావడంతో రాణి తన పిల్లలును తీసుకొని పుట్టింటికి వచ్చి తల్లిదండ్రుల వద్దే నివాసం ఉంటుంది. నిన్న సాయంత్రం నుండి రాణికి అనారోగ్యంగా ఉండటంతో గుంటూరు ఆసుపత్రికి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లిపోయింది. రాత్రి భోజనం చేసిన తర్వాత రాజ్యం ఇద్దరూ పిల్లలతో కలిసి ఒక గదిలో నిద్ర పోయారు. ముందు గదిలో నాగేశ్వరరావు నిద్ర పోయాడు. అయితే నిద్ర పోవడానికి ముందు మస్కిటో కాయిల్ వెలిగించి పడుకున్నాడు. అర్ధరాత్రి రెండు గంటల తర్వాత నాగేశ్వరరావు పడుకున్న మంచం వద్ద ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలు చూసి మేలుకున్న రాజ్యం పెద్దగా కేకలు వేసింది. అయితే, మంటలు నాగేశ్వరరావుకు అంటుకోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వచ్చే సరికి నాగేశ్వరరావు తీవ్ర గాయలతో చనిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాగేశ్వరరావు మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మస్కిటో కాయిల్ అంటుకొని ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నా.. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు రావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంటలు నుండి దూరంగా పారిపోయే అవకాశం ఉన్న అలా జరగక పోవటానికి కారణం ఏంటన్న అంశంలోనూ పోలీసులు కూపీ లాగుతున్నారు.

Palnadu Crime
ఇంటి పక్కల ప్రాంతాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉన్నాయా.. అని క్లూస్ టీంతో చెక్ చేయించారు. స్థానికులు మాత్రం ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
