AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండ వేడి, ఉబ్బరానికి కిటికీలు తెరిచి పడుకుంటున్నారా..? తస్మాత్ జాగ్రత్త! ఈ సంగతి తెలిస్తే..

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రాత్రిపూట కూడా వేడి తగ్గకపోవడంతో ప్రజలు గాలి కోసం కిటికీలు, తలుపులు తెరిచి నిద్రిస్తున్నారు. అయితే, ఇదే అదనుగా భావిస్తున్న దొంగలు తమ పని కానిచ్చేస్తున్నారు. కేరళలోని మలప్పురం జిల్లాలో తాజాగా జరిగిన ఒక చోరీ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎండ వేడి, ఉబ్బరానికి కిటికీలు తెరిచి పడుకుంటున్నారా..? తస్మాత్ జాగ్రత్త! ఈ సంగతి తెలిస్తే..
Summer Safety Tips HomeImage Credit source: freepik
Jyothi Gadda
|

Updated on: Apr 23, 2026 | 7:43 PM

Share

కేరళలోని మలప్పురంలో ఎండ వేడిమి కారణంగా కిటికీలు తెరిచి నిద్రించిన ఒక కుటుంబానికి ఎదురైన చేదు అనుభవం ఇంటర్‌నెట్‌లో టాపిక్‌గా మారింది. వేసవిలో భద్రత విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన హెచ్చరిస్తోంది. మలప్పురం జిల్లాలో తీవ్రమైన ఎండ వేడిమి తట్టుకోలేక రాత్రిపూట కిటికీలు తెరిచి నిద్రించిన ఒక ఇంటి నుంచి బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. వేడి గాలి తగ్గడానికి, చల్లదనం కోసం కిటికీలు తెరిచి ఉంచిన సమయాన్ని ఆసరాగా చేసుకున్న దొంగలు, కిటికీ గుండా చాకచక్యంగా లోపలికి చేయి పోనిచ్చి, నిద్రిస్తున్న మహిళ కాళ్లకు ఉన్న బంగారు పట్టీలను దొంగిలించారు. బాధితురాలు నిద్ర నుండి లేచేలోపే దొంగలు అక్కడి నుండి పరారయ్యారు. మరుసటి రోజు ఉదయం చూసుకోగా బంగారు పట్టీలు మాయమవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వేసవిలో ఇటువంటి చోరీలు పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. కేవలం మలప్పురంలోనే కాకుండా, ఇతర ప్రాంతాల్లో కూడా కిటికీల ద్వారా మొబైల్ ఫోన్లు, నగలను లాక్కెళ్లే ముఠాలు తిరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కిటికీలకు గ్రిల్స్ ఉన్నప్పటికీ, వాటి మధ్య దూరం ఎక్కువగా ఉంటే దొంగలు లోపలికి చేయి పెట్టే అవకాశం ఉంటుంది. వీలైతే సన్నని నెట్ లేదా మెష్ అమర్చుకోవడం మంచిదని చెబుతున్నారు.

కిటికీలకు దగ్గరగా నగలు, మొబైల్ ఫోన్లు లేదా పర్సులను ఉంచకూడదని చెబుతున్నారు. ఇంటి బయట వెలుతురు ఉండేలా చూసుకోవడం వల్ల దొంగలు రావడానికి భయపడతారు. వీలైతే ఇంటి ఆవరణలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల దొంగలను గుర్తించడం సులభమవుతుంది. చల్లని గాలి కోసం ప్రాణాల కంటే విలువైన సొమ్మును రిస్క్ చేయకండి. కిటికీలు తెరిచినప్పుడు కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం ఎంతో ముఖ్యం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలో కొత్త పింఛన్లపై బిగ్ అప్డేట్.. జారీ అప్పటినుంచే..
ఏపీలో కొత్త పింఛన్లపై బిగ్ అప్డేట్.. జారీ అప్పటినుంచే..
ఎండ వేడి, ఉబ్బరానికి కిటికీలు తెరిచి పడుకుంటున్నారా? జాగ్రత్త!
ఎండ వేడి, ఉబ్బరానికి కిటికీలు తెరిచి పడుకుంటున్నారా? జాగ్రత్త!
మహానటి సావిత్రి ఆ తెలుగు స్టార్ హీరోను బావ అని పిలిచేది తెలుసా?
మహానటి సావిత్రి ఆ తెలుగు స్టార్ హీరోను బావ అని పిలిచేది తెలుసా?
ఈ పుట్టిన తేదీల వారికి బంగారం వేసుకుంటే అదృష్టం వెంటపడుతుంది!
ఈ పుట్టిన తేదీల వారికి బంగారం వేసుకుంటే అదృష్టం వెంటపడుతుంది!
మస్కిటో కాయిల్ అంటుకొని చనిపోయాడా..? అర్థరాత్రి ఇంకేమైనా జరిగిందా
మస్కిటో కాయిల్ అంటుకొని చనిపోయాడా..? అర్థరాత్రి ఇంకేమైనా జరిగిందా
చెరకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
చెరకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
టాస్ గెలిచిన ముంబై.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే
టాస్ గెలిచిన ముంబై.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే
యూట్యూబ్ సంపాదన చెప్పిన జబర్దస్త్ మహిధర్..
యూట్యూబ్ సంపాదన చెప్పిన జబర్దస్త్ మహిధర్..
అందమైన పూలు..కానీ,అడవులకు శాపం! భారతదేశాన్ని వణికిస్తున్న ఈ మొక్క
అందమైన పూలు..కానీ,అడవులకు శాపం! భారతదేశాన్ని వణికిస్తున్న ఈ మొక్క
జీవితంలో మళ్లీ అతడితో అస్సలు పని చేయొద్దు అనుకున్నా..
జీవితంలో మళ్లీ అతడితో అస్సలు పని చేయొద్దు అనుకున్నా..