AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నదిలో నీళ్లున్నా బ్రిడ్జి ఎలా కడతారు..? 99శాతం మందికి తెలియని ఇంజినీరింగ్ సీక్రెట్స్ ఇవే..

ప్రతిరోజూ మనలో ఎంతోమంది నదులు, కాలువలపై ఉన్న బ్రిడ్జిల మీదుగా ప్రయాణిస్తుంటాం. వందల టన్నుల బరువున్న భారీ వాహనాలు, రైళ్లు అలవోకగా వెళ్తుంటే.. ఆ వంతెనలు మాత్రం దశాబ్దాల పాటు చెక్కుచెదరకుండా అలానే నిలబడి ఉంటాయి. ఎంతటి వరదలనైనా తట్టుకుంటూ, నది నీళ్ల మధ్యలో బ్రిడ్జిని ఎలా కడతారు..? అనే ఆసక్తికర విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

నదిలో నీళ్లున్నా బ్రిడ్జి ఎలా కడతారు..? 99శాతం మందికి తెలియని ఇంజినీరింగ్ సీక్రెట్స్ ఇవే..
How Bridges Are Built Over Rivers
Krishna S
|

Updated on: Aug 11, 2026 | 10:04 PM

Share

ఉధృతంగా ప్రవహించే నది.. ఆ ఉధృతిని, నీటి వేగాన్ని తట్టుకుంటూ నది మధ్యలో నిలబడే భారీ బ్రిడ్జిలు.. మనం ప్రతిరోజూ వాహనాలపై లేదా రైళ్లలో అనేక బ్రిడ్జిలపై నుంచి ప్రయాణిస్తుంటాం. కానీ క్షణం తీరిక లేకుండా, ఉవ్వెత్తున ఎగిసిపడే నీటి ప్రవాహం మధ్యలో అంత పెద్ద పిల్లర్లను అసలు ఎలా నిర్మిస్తారు? టన్నుల కొద్దీ బరువున్న భారీ వాహనాలు, వేగంగా వెళ్లే రైళ్లు వెళ్తున్నా ఆ పిల్లర్లు ఎలా తట్టుకోగలుగుతాయి? ఎన్నో ఏళ్లు లేదా శతాబ్దాల పాటు నీటిలో ఉన్నప్పటికీ ఆ నిర్మాణాలు చెక్కుచెదరకుండా ఎలా బలంగా ఉంటాయి? అసలు నీటి అడుగున పునాదులు వేయడానికి ఇంజినీర్లు ఎలాంటి మార్గాలను అనుసరిస్తారు? అనే డౌట్లు చాలా మందికి ఉంటాయి. ఈ డిజిటల్ యుగంలో మనకు ఎన్నో వింతలు తెలుసు కానీ, మన కళ్ల ముందే ఉండే ఈ మహా ఇంజినీరింగ్ అద్భుతం వెనుక ఉన్న రహస్యాలు, వారు ఎదుర్కొనే సవాళ్లు చాలామందికి తెలియవు.

ముందుగా నదిని అర్థం చేసుకోవడం

వంతెన కట్టడం అంటే ఏదో ఒక చోట తవ్వడం కాదు. ముందుగా ఇంజినీర్లు ఆ నది స్వభావాన్ని పూర్తిగా పరిశీలిస్తారు. నదిలో నీటి లోతు ఎంత ఉంది? వర్షాకాలంలో నీటి వేగం ఎలా ఉంటుంది? ఎంత ఎత్తు వరకు వరద వచ్చే అవకాశం ఉందో కొలుస్తారు. నది అడుగుభాగంలో ఇసుక ఉందా, రాళ్లు ఉన్నాయా అనేది చూస్తారు. గట్టి రాతి పొర ఎంత లోతులో ఉందో తెలుసుకుని, దానికి తగినట్లుగా పిల్లర్ల సంఖ్యను, డిజైన్‌ను ప్లాన్ చేస్తారు.

కాఫర్ డ్యామ్ పద్ధతి

నీటి మధ్యలో పనిచేయడం సాధ్యం కాదు కాబట్టి, నదిలో’పొడి ప్రదేశాన్ని తయారుచేయడానికి కాఫర్ డ్యామ్ వాడతారు.10 నుండి 20 మీటర్ల పొడవుండే స్టీల్ రేకులను పెద్ద మిషన్ల సాయంతో నది అడుగుభాగంలోకి గట్టిగా దింపుతారు. వీటిని గుండ్రంగా లేదా చతురస్రాకారంలో ఒక మూసివున్న గదిలా తయారుచేస్తారు. ఇలా చుట్టూ గోడ కట్టిన తర్వాత, లోపల ఉన్న నీటిని పెద్ద పెద్ద పంపుల ద్వారా బయటకు తోడి మళ్లీ నదిలోకి వదిలేస్తారు. ఇప్పుడు ఆ ప్రదేశం నీరు లేక పొడిగా మారుతుంది. కార్మికులు లోపలికి దిగి ఇసుక, మట్టి తొలగించి పునాది పనులు మొదలుపెడతారు.

కైసన్ సాంకేతికత

నీరు చాలా లోతుగా ఉన్న చోట కాఫర్ డ్యామ్ కట్టడం కష్టం. అలాంటి చోట్ల కైసన్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. ఇవి నీరు లోపలికి రాకుండా ఉండే పెద్ద పెట్టెల లాంటి నిర్మాణాలు. అడుగుభాగం తెరచి ఉండే ఈ ఖాళీ పెట్టెలు తమ సొంత బరువుతోనే నది అడుగున ఇసుకలోకి మునిగిపోతాయి. బాగా లోతైన ప్రదేశాల్లో గాలి ఒత్తిడిని ఉపయోగించి నీటిని బయటకు పంపిస్తారు. కార్మికులు సురక్షితమైన ప్రత్యేక డోర్ ద్వారా లోపలికి వెళ్లి తవ్వకం పనులు చేస్తారు.

గట్టి పునాదులు – కాంక్రీట్ వేయడం

వంతెన బలంగా నిలబడటానికి పునాదే అత్యంత ముఖ్యం. 20 నుండి 25 మీటర్ల కంటే ఎక్కువ పొడవుండే భారీ ఇనుప పైపులను నది గర్భంలో గట్టి రాయి తగిలేంత వరకు లోపలికి దించుతారు. ఆ పైపులలో కాంక్రీట్ మిశ్రమాన్ని నింపుతారు. కాంక్రీట్ మధ్యలో గాలి బుడగలు ఉండిపోతే నిర్మాణం బలహీనపడుతుంది కాబట్టి వైబ్రేటర్లను ఉపయోగించి గాలిని తొలగించి కాంక్రీట్‌ను గట్టిగా కూరుకుపోయేలా చేస్తారు.

ఈ నిర్మాణాల్లో ఉండే ప్రధాన సవాళ్లు

కాఫర్ డ్యామ్‌కు చిన్న రంధ్రం పడినా నీరు వేగంగా లోపలికి వచ్చి పనులన్నీ ఆగిపోతాయి. అంతేకాకుండా నిర్మాణం జరుగుతున్న సమయంలో అనుకోకుండా వరదలు వచ్చినా, భూకంపం వచ్చినా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఇలా ఆధునిక పరిజ్ఞానం, ఇంజినీర్ల తెలివితేటలు, కార్మికుల కష్టం అన్నీ కలిసి నదిపై బ్రిడ్జి రూపుదిద్దుకుంటుంది.

Follow Us
కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పెళ్లైన 6 రోజులకే వరుడు..
కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పెళ్లైన 6 రోజులకే వరుడు..
జూనియర్ ఆర్టిస్ట్‌గా రూ. 600తో మొదలు పెట్టి.. ఇప్పుడు ఇలా
జూనియర్ ఆర్టిస్ట్‌గా రూ. 600తో మొదలు పెట్టి.. ఇప్పుడు ఇలా
తలస్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. జుట్టు డ్యామేజ్‌
తలస్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. జుట్టు డ్యామేజ్‌
పాత బెడ్‌షీట్‌తో ఇన్ని ఉపయోగాలా? ఇంట్లో ఇలా రీయూజ్ చేసుకోండి!
పాత బెడ్‌షీట్‌తో ఇన్ని ఉపయోగాలా? ఇంట్లో ఇలా రీయూజ్ చేసుకోండి!
బిగ్‌బాస్ 10 ఎనిమిదో కంటెస్టెంట్‌గా షాలినీ పటేల్.. అసలు ఎవరీమే?
బిగ్‌బాస్ 10 ఎనిమిదో కంటెస్టెంట్‌గా షాలినీ పటేల్.. అసలు ఎవరీమే?
తుక్కుగూడ నర్సు హత్య కేసు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
తుక్కుగూడ నర్సు హత్య కేసు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హౌస్‌లోకి ఎంట్రీఇచ్చిన చైత్ర రాయ్ గురించి ఈ విషయాలు తెలుసా
హౌస్‌లోకి ఎంట్రీఇచ్చిన చైత్ర రాయ్ గురించి ఈ విషయాలు తెలుసా
ఏ దేవుడిని ఎప్పుడు పూజిస్తే మంచిది? దేవతలకు ఇష్టమైన ప్రత్యేక..
ఏ దేవుడిని ఎప్పుడు పూజిస్తే మంచిది? దేవతలకు ఇష్టమైన ప్రత్యేక..
బిగ్‌బాస్‌లోకి జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఎంట్రీ.. ఈ విషయాలు తెలుసా?
బిగ్‌బాస్‌లోకి జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఎంట్రీ.. ఈ విషయాలు తెలుసా?
అమెరికాను నెట్టి.. ప్రపంచంలో నెం. 2 మెట్రో నెట్‌వర్క్ గా భారత్
అమెరికాను నెట్టి.. ప్రపంచంలో నెం. 2 మెట్రో నెట్‌వర్క్ గా భారత్