AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రంతా సర్జరీ.. డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? వీడియో వైరల్..

ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. పిల్లలమర్రి సమీపంలో అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొని మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ఖమ్మం మమత హాస్పిటల్‌కు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీశ్ సజీవ దహనమయ్యారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో వైరల్‌గా మారాయి. ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రాత్రంతా సర్జరీ.. డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? వీడియో వైరల్..
Khammam Hyderabad Highway Accident
Shaik Madar Saheb
|

Updated on: Sep 21, 2026 | 10:34 AM

Share

ఖమ్మం – హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి డాక్టర్ దుర్మరణం చెందారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. ఖమ్మంలోని మమత హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్‌గా సేవలందిస్తున్న కాసకుర్తి జగదీశ్ (50) కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే.. పిల్లలమర్రి సమీపానికి రాగానే ఆయన కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్దమైంది.. దీంతోపాటు.. అందులో ప్రయాణిస్తున్న జగదీశ్ సజీవ దహనమయ్యారు.

రాత్రంతా సర్జరీ.. ఉదయాన్నే హైదరాబాద్ కు..

అయితే, ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి వివరాలు సేకరించామన్నారు. ప్రమాదం ఎలా జరిగింది.. కారు అదుపుతప్పడానికి కారణమేంటి? అనే అంశాలతోపాటు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ కె. జగదీష్ బాబు ఆదివారం తెల్లవారుజాము వరకు శస్త్రచికిత్స నిర్వహించి, ఆ తర్వాత హైదరాబాద్‌లోని తన ఇంటికి బయలుదేరినట్లు సమాచారం. ఈ ఘటనకు నిద్రమత్తు కూడా ఒక కారణమని పోలీసులు భావిస్తున్నారు.

వీడియో చూడండి..

కాగా హైవేపై కారు ప్రమాదానికి గురైన సందర్భంలో అక్కడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ను పోలీసులు విడుదల చేశారు. కారు వస్తూనే.. పక్కకు వెళ్లి డివైడర్ ను ఢీకొట్టింది.. అనంతరం మంటలు చెలరేగాయి..

వైద్యరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న న్యూరో సర్జన్ డాక్టర్ జగదీశ్ అకాల మరణంతో కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.

Follow Us
30 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. యూట్యూబ్‏లో చిరంజీవి సాంగ్ హవా చూశారా
30 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. యూట్యూబ్‏లో చిరంజీవి సాంగ్ హవా చూశారా
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్