AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?

UPI PIN Change: నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీలకు UPI (యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) అత్యంత కీలకమైన సాధనంగా మారింది. అయితే, మన బ్యాంక్ ఖాతా భద్రతకు UPI PIN చాలా ముఖ్యం. పిన్‌ను క్రమం తప్పకుండా మార్చుకోవడం..

మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
Upi Pin
Subhash Goud
|

Updated on: Sep 21, 2026 | 9:49 AM

Share

UPI PIN Change: నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీలకు UPI (యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) అత్యంత కీలకమైన సాధనంగా మారింది. అయితే, మన బ్యాంక్ ఖాతా భద్రతకు UPI PIN చాలా ముఖ్యం. పిన్‌ను క్రమం తప్పకుండా మార్చుకోవడం లేదా మర్చిపోయినప్పుడు దాన్ని రీసెట్ చేసుకోవడం ఎలాగో తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం.

పిన్ మార్చడం, రీసెట్ చేయడం మధ్య తేడా ఏంటి?

UPI PIN మార్చడం: మీకు ఇప్పటికే మీ పాత యూపీఐ పిన్‌ నంబర్‌ గుర్తుండాలి. భద్రతా కారణాల దృష్ట్యా దాని స్థానంలో కొత్త పిన్‌ను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది.

PIN రీసెట్ చేయడం: ఒకవేళ మీరు మీ యూపీఐ పిన్‌ను పూర్తిగా మర్చిపోయినట్లయితే డెబిట్ కార్డ్ వివరాలు లేదా ఆధార్ కార్డ్ సహాయంతో కొత్త పిన్‌ను క్రియేట్ చేసుకోవడాన్ని రీసెట్ చేయడం అంటారు.

1. UPI PIN మార్చుకోవడం ఎలా?

  • మీ ఫోన్‌లో ఉన్న Google Pay, PhonePe, Paytm లేదా BHIM యాప్‌ను ఓపెన్ చేయండి.
  • తర్వాత మీ ప్రొఫైల్ (Profile) విభాగానికి వెళ్లి, సంబంధిత బ్యాంక్ ఖాతాను (Bank Account) ఎంచుకోండి.
  • అక్కడ కనిపిచే “Change UPI PIN” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • మొదట మీ పాత UPI PINను నమోదు చేయండి.
  • ఆ తర్వాత మీరు కొత్త సెట్‌ చేసుకోవాలనుకుంటున్న కొత్త యూపీఐ పిన్‌ నంబర్‌ను నమోదుచేసి కన్ఫర్మ్‌ చేయండి.

2. మర్చిపోయిన UPI PINను రీసెట్ చేయడం ఎలా?

  • మీ యూపీఐ యాప్‌లోని బ్యాంక్ ఖాతా సెక్షన్ వద్దకు వెళ్ళండి.
  • “Forgot PIN” లేదా “Reset PIN” ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • మీ డెబిట్ (ATM) కార్డ్ చివరి 6 అంకెలు, అలాగే కార్డు ఎక్స్‌పైరీ తేదీ నమోదు చేయండి. (కొన్ని యాప్‌లలో ఆధార్ నంబర్ / ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా రీసెట్ చేసుకునే సౌకర్యం ఉంది).
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.
  • ఇప్పుడు మీకు నచ్చిన కొత్త UPI PINను సెట్ చేసుకోండి.

భద్రతా సూచనలు:

  1. పిన్ వివరాలు షేర్ చేయవద్దు: మీ యూపీఐ పిన్‌ను ఎవరితోనూ పంచుకోవద్దు. బ్యాంకు సిబ్బందితో సహా..
  2. సులభమైన పిన్‌లు వద్దు: 1234, 0000, 2222 వంటివి సులభంగా గుర్తుపెట్టుకునే పిన్‌ నంబర్లను వాడకపోవడం మంచిదని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు.
  3. తరచుగా మార్చండి: ఖాతా భద్రత కోసం ప్రతి కొన్ని నెలలకొకసారి UPI పిన్‌ను మార్చడం మంచి అలవాటు.

ఇది కూడా చదవండి: Youtube క్రియేటర్లకు అలర్ట్.. మానిటైజేషన్ కోసం 8,000 వాచ్ అవర్స్ లేదా 2 కోట్ల షార్ట్స్ వ్యూస్!

ఇది కూడా చదవండి: Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి అలర్ట్.. ఈ రోజు తులం ధర ఎంత ఉందో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
మార్షల్‌ ఆర్ట్స్‌లో మెరిసిన భారత్.. ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం!
మార్షల్‌ ఆర్ట్స్‌లో మెరిసిన భారత్.. ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం!
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
శ్రీపెరుంబూదూర్ ప్రతిరూపం: 240 ఏళ్ల నాటి ‘అభినవ భూతపురి’ విశేషాలు
శ్రీపెరుంబూదూర్ ప్రతిరూపం: 240 ఏళ్ల నాటి ‘అభినవ భూతపురి’ విశేషాలు
వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే తోపు మ్యాచ్.. చివరి బంతి వరకు ఉత్కంఠే
వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే తోపు మ్యాచ్.. చివరి బంతి వరకు ఉత్కంఠే
అమెరికా కొత్త దాడులకు దిగితే తీవ్ర ప్రతిదాడి చేస్తాం..
అమెరికా కొత్త దాడులకు దిగితే తీవ్ర ప్రతిదాడి చేస్తాం..
అభిషేక్, వైభవ్‌లకు ఇచ్చిపడేసిన మాజీ స్టార్ ప్లేయర్..!
అభిషేక్, వైభవ్‌లకు ఇచ్చిపడేసిన మాజీ స్టార్ ప్లేయర్..!
బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ అతడే..
బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ అతడే..