Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి అలర్ట్.. ఈ రోజు తులం ధర ఎంత ఉందో తెలుసా?
Gold Price Today: భారతదేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ బంగారం ధరలు, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు రేటు, దేశీయ డిమాండ్ వంటి అనేక అంశాలచే ప్రభావితమవుతాయి. పండుగ సీజన్‌కు ముందు ఆభరణాలకు పెరిగిన డిమాండ్ కూడా బంగారం ధరలపై ప్రభావం..

Gold Price Today: పెట్టుబడిదారులు, అలాగే ఆభరణాల కొనుగోలుదారులు బంగారం, వెండి ధరలను నిశితంగా గమనిస్తున్నారు. సెప్టెంబర్ 21, 2026న ప్రధాన నగరాల్లో రిటైల్ బంగారం ధరలలో పెద్దగా మార్పు లేనప్పటికీ.. కాకపోతే గత రెండు, మూడు రోజుల నుంచి ధరలు భారీగానే పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగుతోంది. భారతదేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ బంగారం ధరలు, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు రేటు, దేశీయ డిమాండ్ వంటి అనేక అంశాలచే ప్రభావితమవుతాయి. పండుగ సీజన్‌కు ముందు ఆభరణాలకు పెరిగిన డిమాండ్ కూడా బంగారం ధరలపై ప్రభావం చూపవచ్చు. అయితే వారం రోజుల్లో తులం బంగారంపై ఏకంగా 2600 రూపాయల వరకు ఎగబాకింది.
ఢిల్లీ, ముంబై సహా ప్రధాన నగరాల్లో బంగారం ధర
సోమవారం ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,980గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,42,990గా ఉంది. ఇక ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,830గా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,42,840గా ఉంది. అలాగే బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,830గా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,42,840గా ఉంది.
అలాగే తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,830గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,42,840గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,830గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,42,840గా ఉంది. ఇక వెండి విషయానికొస్తే ఇది స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కిలోవెండి ధర రూ.2,54,900 వద్ద ట్రేడవుతోంది.
ఇది కూడా చదవండి: Compound Walls: ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే గోడ బీటలు వారడం ఖాయం!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
