AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దోశను ఇంగ్లీషులో ఏమంటారు..? 99శాతం మందికి తెలియని అసలు నిజం ఇదే..

పెనం మీద పిండి పోసి గుండ్రంగా తిప్పుతూ, నూనె లేదా నెయ్యి వేసి దోరగా కాల్చి, పక్కన అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, వేడివేడి సాంబార్‌తో వడ్డిస్తే.. లొట్టలేసుకుంటూ లాగించని భారతీయుడు ఉంటారా? గల్లీలోని టిఫిన్ బండి మొదలుకొని విదేశాల్లోని స్టార్ హోటళ్ల వరకు అందరినీ ఫిదా చేస్తున్న ఏకైక దక్షిణ భారత వంటకం దోశ.. అయితే.. విశ్వవ్యాప్తంగా ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ దోశను ఇంగ్లీషులో ఏమని పిలుస్తారో మీకు తెలుసా? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

దోశను ఇంగ్లీషులో ఏమంటారు..? 99శాతం మందికి తెలియని అసలు నిజం ఇదే..
What Is Dosa Called In English
Krishna S
|

Updated on: Sep 20, 2026 | 5:18 PM

Share

దక్షిణ భారత వంటకాల గురించి ప్రస్తావించగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది, నోరూరించేది దోశ. ఉదయం టిఫిన్ అయినా, రాత్రి డిన్నర్ అయినా.. ఏ సమయంలోనైనా వేడివేడి దోశ తింటే వచ్చే తృప్తి మాటల్లో చెప్పలేనిది. వీధుల్లోని చిన్న చిన్న తోపుడు బండ్ల నుంచి స్టార్ హోటళ్ల వరకు అంతటా రాజ్యమేలుతున్న ఈ వంటకం.. పేద-ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి మనసును దోచుకుంది. నేడు ఇది కేవలం మన దేశంలోనే కాకుండా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాల్లోనూ భారతీయులతో పాటు విదేశీయులనూ ఫిదా చేస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది.

నోరూరించే రకాలు.. అదిరిపోయే కాంబినేషన్లు

దోశ అనగానే ఒక్కటే రకం కాదు, అందులో లెక్కలేనన్ని వెరైటీలు ఉన్నాయి. మసాల దోశ, ఉల్లి దోశ, బటర్ దోశ, ఎగ్ దోశ, రవ్వ దోశ, కారం దోశ, రాగి దోశ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితాయే ఉంది. ముఖ్యంగా బంగాళాదుంపలు, ఉల్లిపాయల మసాలాతో నింపిన మసాలా దోశ ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్. ఇక దీనికి జోడీగా తినే కాంబినేషన్లు మరింత ప్రత్యేకం. కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ, పుదీనా, టమాటా చట్నీలతో పాటు ఘుమఘుమలాడే సాంబార్ తప్పనిసరి. కొందరైతే దీనిని చికెన్, మటన్, చేపల కూరలతో ఎంజాయ్ చేస్తే, మరికొందరు సంప్రదాయబద్ధంగా బటర్, నెయ్యి, బెల్లం లేదా పంచదారతో లాగించేస్తుంటారు.

దోశను ఇంగ్లీషులో ఏమంటారు?

దోశ గురించి చాలా మందిలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న మెదులుతుంటుంది.. అసలు దోశను ఇంగ్లీషులో ఏమని పిలుస్తారు? అని. సమాధానం చాలా సింపుల్.. దోశను ఇంగ్లీషులో కూడా దోశ అనే పిలుస్తారు. దీనికంటూ ప్రత్యేకమైన మరో ఇంగ్లీష్ పేరు ఏదీ లేదు. అయితే విదేశీయులకు అర్థమయ్యేలా ఇంగ్లీష్ డిక్షనరీలు దీనిని Savory pancake లేదా సౌత్ ఇండియన్ క్రేప్ అని వర్ణిస్తాయి. పాశ్చాత్య దేశాల పాన్‌కేక్‌లు సాధారణంగా తీపిగా, మెత్తగా ఉంటాయి. కానీ దోశ కరకరలాడుతూ, పులియబెట్టిన బియ్యం-మినప పిండితో తయారై పోషక విలువలతో, తేలిగ్గా జీర్ణమయ్యేలా ఉంటుంది.

దక్షిణ భారత సంస్కృతికి ప్రతీక

దోశ అనే పదానికి మూలాలు దక్షిణ భారత భాషల్లో ఉన్నాయి. శతాబ్దాల పురాతన చరిత్ర కలిగిన ఈ వంటకాన్ని కన్నడ, మలయాళంలో దోస అని, తమిళంలో దోసై అని, తెలుగులో దోశ అని పిలుస్తారు. తన మూలాలను, సొంత పేరును ఏమాత్రం కోల్పోకుండా విశ్వవ్యాప్తంగా ఖ్యాతి గడించిన దోశ.. కేవలం ఒక ఆహార పదార్థం మాత్రమే కాదు దక్షిణ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు అసలైన ప్రతీకగా నిలుస్తోంది.

Follow Us