AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: చోరీ అట్టర్‌ప్లాప్.. అద్దెకుంటూ యజమాని ఇంట్లోనే దొంగతనం.. చివరకు ఒక్క ఫోన్‌ కాల్‌తో దొరికిపోయాడు..!

Andhra Pradesh: నగరంలోని అహ్మద్ నగర్ లో రఫి అనే వ్యక్తి సఫీ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. సఫీ మొదటి అంతస్థులో ఉంటూ రఫికి రెండో అంతస్తు అద్దెకు ఇచ్చాడు. అయితే రఫి క్రికెట్ బెట్టింగ్ లకు అలవాటు పడి ఆర్థికంగా నష్టపోయాడు..

Andhra Pradesh: చోరీ అట్టర్‌ప్లాప్.. అద్దెకుంటూ యజమాని ఇంట్లోనే దొంగతనం.. చివరకు ఒక్క ఫోన్‌ కాల్‌తో దొరికిపోయాడు..!
Guntur Police Stations
T Nagaraju
| Edited By: |

Updated on: Nov 09, 2026 | 1:30 PM

Share

Andhra Pradesh: యజమాని ఇంట్లో లేడన్న విషయాన్ని రూఢీ చేసుకున్నాడు. చోరి చేస్తే ఎవరికి అనుమానం రాదనుకున్నాడు.. పక్కా ప్లాన్ వేసి చోరి చేసి చేతులుదులుపుకున్నాడు.. అయితే రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి అద్దెకు ఉంటున్న వ్యక్తే దొంగతనం చేసినట్లు తేల్చి అరెస్ట్ చేశారు. ఈ ఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది.

గుంటూరు నగరంలోని అహ్మద్ నగర్ లో రఫి అనే వ్యక్తి సఫీ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. సఫీ మొదటి అంతస్థులో ఉంటూ రఫికి రెండో అంతస్తు అద్దెకు ఇచ్చాడు. అయితే రఫి క్రికెట్ బెట్టింగ్ లకు అలవాటు పడి ఆర్థికంగా నష్టపోయాడు. ఈ క్రమంలోనే గత నెల 25వ తేదిన సఫీ కుటుంబం చికిత్స నిమిత్తం వైజాగ్ వెళ్లింది. 26 వ తేదిన చికిత్స చేయించుకొని 27వ తేదిన సఫీ కుటుంబం గుంటూరు తిరిగి వచ్చింది. అయితే ఇంటికి వచ్చేసరికి తాళం పగుల కొట్టి ఉండటాన్ని సఫీ కుటుంబం గుర్తించి పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఇంట్లో చోరి జరిగినట్లు గుర్తించారు. బీరువాలోని 153 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతో పాటు ఐదు వేల నగదు కూడా దొంగలు తీసుకెళ్లారు. సఫీ కుంటుంబం ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సిసి కెమెరా విజువల్స్, ఫోన్ కాల్ డేటాను సేకరించారు.

నిందితుడిని పట్టించిన ఫోన్ కాల్..

పోన్ కాల్ డేటాను పరిశీలించే సమయంలో రఫి.. సఫీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్లు తేలింది. ఎందుకు ఫోన్ చేశారో చెప్పాలంటూ పోలీసులు సఫీ కుటుంబాన్ని అడగ్గా.. అద్దె చెల్లించేందుకు రఫీ ఫోన్ చేశాడని అయితే అప్పటికే తాము వైజాగ్ లో ఉండటంతో అదే విషయాన్ని చెప్పామని కుటంబ సభ్యులు తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు రఫిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా చోరి చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్ని కన్ఫామ్ చేసుకున్న తర్వాత రఫీ చోరి చేసినట్లు పోలీసులు తేల్చారు. రఫిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద చోరికి గురైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us