AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్తీక మాసంలో వీరికి 3 గ్రహాల అనుగ్రహం.. పెట్టుబడులతో లాభాల పంట..!

Money Astrology: కార్తీక మాసంలో మూడు శుభ గ్రహాల అనుకూల సంచారం కొన్ని రాశుల వారికి ఆర్థికంగా కలిసిరానుంది. ముఖ్యంగా వ్యాపారాలు, పెట్టుబడులు, షేర్లు, స్పెక్యులేషన్లలో లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ అదృష్టం ఏయే రాశుల వారికి కలగనుంది? ఎవరికి కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు ఇది అనుకూల సమయం? ఇప్పుడు చూద్దాం..

కార్తీక మాసంలో వీరికి 3 గ్రహాల అనుగ్రహం.. పెట్టుబడులతో లాభాల పంట..!
Investments Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 09, 2026 | 1:37 PM

Share

జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధుడు మదుపులు, పెట్టుబడులు, బ్యాంకులు, వ్యాపారాలు, షేర్లు, స్పెక్యులేషన్లకు కారకుడు కాగా, గురు, శుక్రులు ఆదాయానికి, లాభాలకు కారకులు. కార్తీక మాసమంతా ఈ మూడు శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని రాశులవారు మదుపులు, పెట్టుబడులు, షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా అత్యధికంగా ఆదాయం కూడగట్టుకునే అవకాశం ఉంది. బుధ, శుక్రుల సంచారం వల్ల వ్యాపార సంబంధమైన తులా రాశికి బలం పెరిగినందువల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి కొత్త వ్యాపారాలకు, వ్యాపారాల్లో పెట్టుబడులకు, షేర్లకు, ఆర్థిక లావాదేవీలకు సమయం బాగా అనుకూలంగా ఉంది.

మేషం

ఈ రాశికి పంచమ, సప్తమ స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల ఈ రాశివారికి ఎటువంటి పెట్టుబడి పెట్టినా, ఎంత పెట్టుబడి పెట్టినా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారాలు ప్రారం భించడానికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగులు కూడా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది. షేర్లు, స్టాకులు కొనడం వల్ల అంచనాల్ని మించిన లాభాలు పొందుతారు. భూములు, ఆస్తులు, బంగారం మీద పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా అపార ధన లాభాలు కలుగుతాయి.

మిథునం

ఈ రాశికి అధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో, వ్యాపార సంబంధమైన తులా రాశిలో శుక్రుడితో కలిసి సంచారం చేస్తున్నందువల్ల షేర్లు, స్పెక్యులేషన్లు అత్యధికంగా లాభిస్తాయి. మదు పులు, పెట్టుబడులు అంచనాలను మించిన లాభాలనిస్తాయి. వడ్డీ వ్యాపారాలు, పందాలు కూడా లాభాల వర్షం కురిపిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు పొందడం జరుగుతుంది. ఇతరులతో కలిసి చేసే వ్యాపారాలు కూడా బాగా లాభిస్తాయి.

ఇవి కూడా చదవండి

కర్కాటకం

ఈ రాశికి ధన స్థానంలో గురువు, చతుర్థ స్థానంలో బుధ, శుక్రుల సంచారం వల్ల ఈ రాశివారు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అత్యధికంగా లాభం పొందే అవకాశం ఉంది. శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎటువంటి పెట్టుబడి పెట్టినా, ఏ విధంగా మదుపు చేసినా లాభాల పంట పండుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అంచనాల్ని మించిన ధన లాభాలు కలుగుతాయి. అదనపు ఆదాయం బాగా వృద్ధి చెందు తుంది.

కన్య రాశి

రాశ్యధిపతి బుధుడు ధన స్థానంలో, ధనాధిపతి శుక్రుడితో సంచారం చేయడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయం పెరగడంతో పాటు, అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల కూడా అత్యధికంగా లాభాలు పొందుతారు. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. దూరదృష్టితో, ప్రణాళికా బద్ధంగా వ్యవహరించే ఈ రాశివారు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల బాగా కలిసి వస్తుంది.

తుల రాశి

ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడితో భాగ్యాధిపతి బుధుడు యుతి చెందడం, లాభ స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశివారు అతి తక్కువ పెట్టుబడితో అత్యంత సంపన్నులయ్యే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాలు లాభిస్తాయి. ఆభరణాల వ్యాపారం కనక వర్షం కురిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి.

మకర రాశి

ఈ రాశికి దశమ స్థానంలో భాగ్య, దశమాధిపతులైన బుధ, శుక్రులు కలవడం వల్ల ఆస్తిపాస్తుల మీదా, రియల్ ఎస్టేట్ మీదా పెట్టుబడులు పెట్టడం వల్ల అపార ధన లాభం కలుగుతుంది. ఇతరు లతో కలిసి వ్యాపారాలు చేయడం వల్ల లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, బంగారం, భూమి, లాటరీల మీద పెట్టుబడులు పెట్టి ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంది. అదనపు ఆదాయ వృద్ధికి అవకాశం ఉన్నందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.

Also Read: ఇంట్లో లక్ష్మీదేవి నిలవడం లేదా? ఆర్థిక కష్టాలకు ఈ వాస్తు దోషాలే కారణం కావొచ్చు..!

Follow Us