AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: నవంబర్ 08-14 వారఫలాలు.. ఈ రాశుల వారికి కనక వర్షమే!

వార ఫలాలు (నవంబర్ 8-14, 2026): మేష రాశి వారికి ఈ వారం ఆదాయం బాగా పెరిగి వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులు బాగా తగ్గుతాయి. మిథున రాశి వారికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 07, 2026 | 3:35 PM

Share
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రాశ్యధిపతి కుజుడు ఈ వారం చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయం బాగా పెరిగి వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తి చేస్తారు. వివాదాల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహవంతంగా పురోగమిస్తుంది. నిరుద్యోగులకు దూరప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. బంధు మిత్రుల నుంచి రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడితో సహా గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన పనులు, వ్యవహారాలు బాగా విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులు బాగా తగ్గుతాయి. బంధుమిత్రుల వల్ల కొద్దిగా ఆర్థిక నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఇష్టమైన బంధువులతో శుభ కార్యంలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపా రాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి, ఉద్యోగ ప్రయ త్నాల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు వెడతారు. ఆదాయం బాగానే ఉంటుంది. తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడితో పాటు శుక్రుడు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో కూడా ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఊహించని శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి జీవితం బాగా బిజీగా సాగుతుంది. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. కుటుంబ జీవితం బాగా అనుకూలంగా ఉంటుంది. పిల్లలు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. ధనపరంగా ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): గురు, కుజుల సంచారం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా నెరవేరుతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా, అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల్ని మీ పనితీరుతో బాగా ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నందువల్ల ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తీర్థయాత్రలు లేదా విహార యాత్రలకు ప్లాన్ వేయడం జరుగుతుంది.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ రాశిలో కుజ, గురువుల యుతి వల్ల అష్టమ శని దోషం నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు, వివాదాలు పూర్తిగా పరిష్కారమవుతాయి. షేర్లు, స్పెక్యులే షన్లు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో అధికారులు బాధ్యతల్ని పెంచే అవకాశం ఉంది. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడికి, ధనాధిపతి శుక్రుడికి పరివర్తన జరగడం వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభించే అవకాశం ఉంది. వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితంలో మీ ప్రతిభా పాటవాలు, సమర్థత మరింతగా వెలుగులోకి వస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి.  విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. తల్లితండ్రులు ఇంటికి వచ్చే అవకాశముంది. నిరుద్యోగులు తమ ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆదాయం పెరుగుతుంది.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడు భాగ్యాధిపతి బుధుడితో కలిసి ఇదే రాశిలో ఉండడం, లాభ స్థానంలో గురువు సంచారం వల్ల వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఇంటా బయటా గౌరవమర్యాదలకు లోటుండదు. రాజపూజ్యాలు పెరుగుతాయి. ఆర్థికంగా బలం పెరుగుతుంది. ఆదాయం సంతృప్తికరంగా వృద్ధి చెందుతుంది. కొందరు బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. వృత్తి, ఉద్యోగాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనుకోకుండా బంధువర్గంలోనే మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల వల్ల కొద్దిగా ధననష్టం జరిగే అవకాశం ఉంది.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రాశ్యధిపతి కుజుడు నవమ, దశమ స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం కలుగుతుంది. మరింత మంచి సంస్థలోకి మారి ఉన్నత పదవి అందుకోవడానికి కూడా అవకాశం ఉంది. వృత్తి జీవితంలో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో లాభాలకు ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. రావలసిన డబ్బు సకా లంలో చేతికి అందుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. ఉద్యోగులకు కూడా డిమాండ్ బాగా పెరుగుతుంది. అనుకోకుండా బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): భాగ్య, లాభ స్థానాలు పటిష్ఠంగా ఉన్నందువల్ల ఉద్యోగపరంగా కొన్ని యోగాలు పట్టే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. అనుకోకుండా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు స్వదేశం నుంచే కాక, విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశముంది. అదనపు ఆదాయం కోసం మరింత ఎక్కువగా శ్రమపడతారు. కుటుంబ సభ్యుల నుంచి కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్త వుతాయి. కొందరు మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆల యాలకు వెడతారు. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4), శ్రవణం, ధనిష్ట 1,2): దశమ స్థానంలో బుధ, శుక్ర, రవులు, తృతీయ స్థానంలో రాశ్యధిపతి శని సంచారం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అధికార లాభం కూడా కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. సమాజంలో రాజ పూజ్యాలకు లోటుండదు. ఉద్యోగ జీవితం ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది శ్రమతో అత్యధిక ప్రయోజనాలు పొందుతారు. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడ తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సంబంధించి శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది.  ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): సప్తమ స్థానంలో గురువు సంచారం చేస్తున్నంత కాలం ఉద్యోగంలో ప్రాధాన్యానికి, గౌరవ మర్యాద లకు లోటుండదు. వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సజావుగా, సానుకూలంగా సాగిపోతాయి. అధికా రులు నమ్మకం పెంచుకోవడం వల్ల పనిభారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు లాభ సాటిగా కొనసాగుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. కుటుంబపరంగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన అవసరాలు, ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు బాగా నిదానంగా కొనసాగుతాయి.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): షష్ట స్థానంలో రాశ్యధిపతి గురువు సంచారం వల్ల ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కొన్ని సమస్యలు, ఒత్తిళ్లతో ఇబ్బంది పడతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆదాయం పెరగడం తప్ప తగ్గడం ఉండదు. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి.  ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో చిన్నా చితకా సమస్యలున్నా అధిగమిస్తారు. ఆధికారుల నుంచి సానుకూలతలు ఎక్కువగా ఉంటాయి. పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు లాభిస్తాయి.  పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొందరు బంధు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.  నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి.

12 / 12
Follow Us