చద్దన్నం తింటే బరువు తగ్గుతారా? బరువు పెరుగుతారా?

09 November 2026

TV9 Telugu

TV9 Telugu

చద్దన్నంతో శరీరానికి కావాల్సినంత బ్యాక్టీరియా ల‌భిస్తుంది. ఒంట్లో వేడి చేయడం కార‌ణంగా మన బాడీలో కలిగే దుష్ఫలితాలను చద్దన్నం తగ్గిస్తుంది

TV9 Telugu

తరచూ చద్దన్నం తినడంవల్ల ఫైబర్‌ కంటెంట్ పెరిగి మల బద్దకం, నీరసం లాంటి సమస్యలు తగ్గిపోతాయి

TV9 Telugu

అదేవిధంగా ర‌క్తపోటు (బీపీ) అదుపులో ఉండి, ఆందోళన తగ్గుతుంది. శ‌రీరం ఎక్కువ‌సేపు ఉల్లాసంగా ఉండటానికి తోడ్పడుతుంది

TV9 Telugu

ఈ చద్దన్నం స‌న్నగా ఉన్నవాళ్లు లావ‌య్యేందుకు, లావుగా ఉన్నవాళ్లు స‌న్నబ‌డేందుకు కూడా తోడ్పడుతుంది

TV9 Telugu

లావు తగ్గాలంటే రాత్రి మిగిలిన అన్నాన్ని రాత్రే చ‌ల్లలో నాన‌బెట్టుకుని ఉద‌యాన్నే తినాలి. రోజూ ఇలా చేయడంవల్ల స్థూలకాయులు క్రమంగా లావు త‌గ్గుతారు

TV9 Telugu

అదేవిధంగా రాత్రి మిగిలిన అన్నంలో పాలుపోసి చిటికెడు పెరుగుతో తోడేసుకుంటే తెల్లారేస‌రికే తోడ‌న్నం త‌యార‌వుతుంది

TV9 Telugu

నిత్యం ఈ తోడన్నం తినడంవల్ల స‌న్నగా ఉన్నవాళ్లు క్రమంగా ఒళ్లు చేస్తారు. ఇలా పాలతో తోడేసిన అన్నాన్ని గానీ, చ‌ల్లలో నాన‌బెట్టిన అన్నాన్నిగానీ నేరుగా తినొచ్చు

TV9 Telugu

ఇందులో ఉల్లిముక్కలు, టమాటా, క్యారెట్ లాంటివి కలుపుకుని తాలింపు పెట్టుకుని కూడా లాగించొచ్చు