AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: రూ.500 నోట్లు రద్దు చేయాల్సిందే.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.500 నోటు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీని కోరుతున్నట్లు తెలిపారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

Chandrababu: రూ.500 నోట్లు రద్దు చేయాల్సిందే.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
Chandrababu
Venkatrao Lella
|

Updated on: Nov 09, 2026 | 1:43 PM

Share

రూ.500 నోట్ల గురించి సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.500 నోటు రద్దు చేయాలని కోరారు. రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాని డిమాండ్ చేశారు. అవినీతి నిర్మూలనకు డిజిటల్‌ కరెన్సీ ఉత్తమమని, డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేయాలని సూచించారు. ఈ మేరకు దీని గురించి ప్రధాని మోదీని డిమాండ్‌ చేస్తూనే ఉంటానని, టెక్నాలజీ బాగుంటే సంపద సృష్టి జరుగుతుందని స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలన కష్టం కాదని చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై స్పందించేందుకు సోమవారం అమరావతిలో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అర్నబ్, మురసు  తుపాను సమయంలోనూ ప్రజల కష్టాల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం ఇచ్చామన్న చంద్రబాబు.. ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలు గుర్తించి ఎన్నికల్లో మద్దతుగా నిలిచారన్నారు. రెండున్నరేళ్ల పాలన, అభివృద్ధికి ప్రజల ఆమోదం తెలిపారని, సుపరిపాలనకు ప్రజలు గౌరవం ఇచ్చారన్నారు. పట్టణాలు, పల్లెలు, ప్రాంతాలనే తేడా లేకుండా ప్రజలు ఒకే విధమైన తీర్పు ఇచ్చారని, ప్రజల మద్దతుతో భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేస్తామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై అనవసర వాదనలు మానుకోవాలని సూచించిన చంద్రబాబు.. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. ఈవీఎంలపై ఆరోపణలు చేసిన వైసీపీ.. బ్యాలెట్ విధానంలోనూ ఫలితాలను ఎలా ప్రశ్నిస్తోందని విమర్శించారు. మండల పరిషత్ అధ్యక్ష స్థానాల్లో 90 శాతానికి పైగా కూటమి విజయం సాధించిందని, 659 డిప్యూటీ ఎంపీపీ స్థానాలకు గాను కూటమికి 575 స్థానాలు వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు.

Follow Us