AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? ఈ 4 చిట్కాలతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!

ఎండలు ముదురుతుంటే చాలు.. ఏ పని చేయాలన్నా ఓపిక ఉండదు. కొద్దిసేపు బయటకు వెళ్లినా శరీరం అలసిపోయి నీరసం వచ్చేస్తుంది. అయితే, కొన్ని చిన్నపాటి జీవనశైలి మార్పులతో ఈ వేసవిలో కూడా మీరు రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న ఆ సులభమైన మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం..

రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? ఈ 4 చిట్కాలతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
how to avoid tiredness in heatImage Credit source: freepik
Jyothi Gadda
|

Updated on: Apr 23, 2026 | 5:19 PM

Share

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనివల్ల నీరసం ఆవరిస్తుంది. దీనిని అధిగమించడానికి నాలుగు ముఖ్యమైన సూత్రాలను నిపుణులు సూచిస్తున్నారు. మండే ఎండలతో అలిసి పోకుండా, రోజంతా ఉత్సాహంగా (Energetic) ఉండటానికి పాటించాల్సిన నియామాలేంటో తప్పక తెలుసుకోండి. అది తెలిస్తే, ఎంతటి ఎండలోనైనా నీరసం, అలసటను తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి.

1. నీరు, ద్రవ పదార్థాలు: శరీరంలో నీటి శాతం తగ్గడమే నీరసానికి ప్రధాన కారణం. దాహం వేసినా వేయకపోయినా గంటకోసారి నీరు తాగడం అలవాటు చేసుకోండి. కేవలం నీటితోనే కాకుండా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి సహజ పానీయాలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి.

2. ఆహారపు అలవాట్లు: వేసవిలో జీర్ణక్రియ కొంచెం నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి, నూనెలో వేయించిన పదార్థాలు, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండండి. పుచ్చకాయ, దోసకాయ, నారింజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

3. కెఫీన్, చక్కెరను తగ్గించండి: చాలా మంది అలసటగా ఉందని పదే పదే కాఫీ, టీలు లేదా కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఇవి తాత్కాలికంగా శక్తిని ఇచ్చినట్లు అనిపించినా, తర్వాత శరీరాన్ని మరింత డీహైడ్రేట్ చేస్తాయి. వీటికి బదులుగా ఇంట్లో తయారుచేసిన పండ్ల రసాలు ఉత్తమం.

మంచి నాణ్యమైన నిద్ర: శరీరం తిరిగి శక్తిని పొందాలంటే తగినంత నిద్ర అవసరం. వేసవిలో రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. దీనివల్ల మరుసటి రోజు రోజంతా నీరసంగా అనిపిస్తుంది. చల్లని, ప్రశాంతమైన వాతావరణంలో కనీసం 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి.

ఈ నాలుగు చిట్కాలను పాటించడం ద్వారా మీరు వేసవి వేడిని తట్టుకోవడమే కాకుండా, మీ పనులను మరింత సమర్థవంతంగా పూర్తి చేయగలరు. ఆరోగ్యం పట్ల చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వేసవిని కూడా ఎంజాయ్ చేయవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us