AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా.. 90 కి.మీ. మైలేజ్‌తో సుజుకి నుంచి సూపర్ స్కూటీ.. ధర ఎంతో తెలుసా..?

టూ వీలర్ మార్కెట్‌లో ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతోంది.. అదే సుజుకి యాక్సెస్.. హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిస్తూ, అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది ఈ జపనీస్ స్కూటర్. కేవలం ఏడాది కాలంలోనే ఊహించని వృద్ధిని సాధించి, టాప్-3 స్థానంలో పాగా వేసింది. అసలు యాక్సెస్ జోరు వెనుక ఉన్న రహస్యం ఏంటి? త్వరలో రానున్న 90 కి.మీ మైలేజ్ ఇచ్చే CNG వెర్షన్ కథేంటి? అనేది తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Apr 23, 2026 | 5:29 PM

Share
భారతీయ రోడ్లపై అత్యధికంగా కనిపించే స్కూటర్లలో సుజుకి యాక్సెస్ ఒకటి. తన క్లాసిక్ లుక్, నమ్మకమైన ఇంజన్ పనితీరుతో దశాబ్ద కాలంగా ఆకట్టుకుంటున్న ఈ జపనీస్ స్కూటర్, తాజాగా సేల్స్ రిపోర్ట్స్‌లో సరికొత్త రికార్డులను సృష్టించింది. హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి హేమాహేమీలకు గట్టి పోటీనిస్తూ మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. తాజాగా రుస్లాన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. సుజుకి యాక్సెస్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగాయి.

1 / 5
మార్చి 2025లో 66,362 యూనిట్లు అమ్ముడవగా.. మార్చి 2026 నాటికి ఈ సంఖ్య 72,658 యూనిట్లకు చేరింది. కేవలం ఒక్క ఏడాదిలోనే 6,296 స్కూటర్లను సుజుకి అదనంగా విక్రయించగలిగింది.  9.49 శాతం అద్భుతమైన వృద్ధిని నమోదు చేసి, దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ల జాబితాలో టాప్-3లో నిలిచింది. ప్రస్తుతం ఈ జాబితాలో హోండా యాక్టివా 2,59,670 యూనిట్లతో మొదటి స్థానంలో, టీవీఎస్ జూపిటర్ 2,24,771 యూనిట్లతో రెండవ స్థానంలో ఉన్నాయి. అయితే 125cc సెగ్మెంట్‌లో సుజుకి యాక్సెస్ ఇస్తున్న పోటీ మిగిలిన కంపెనీలను ఆలోచనలో పడేస్తోంది.

2 / 5
పవర్‌ఫుల్ ఇంజన్.. బడ్జెట్ ధర: సుజుకి యాక్సెస్ సక్సెస్‌కు ప్రధాన కారణం దాని 124cc ఫోర్ స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్. ఇది గరిష్టంగా 6.2 kW పవర్‌ను, 10.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పట్టణాల్లో ట్రాఫిక్ మధ్య ప్రయాణించడానికి ఈ పవర్ సరిగ్గా సరిపోతుంది. ధర విషయానికి వస్తే.. దీని ఎంట్రీ లెవల్ వేరియంట్ కేవలం రూ. 82,906 వద్ద లభిస్తోంది, ఇది మిడిల్ క్లాస్ బడ్జెట్‌కు అనుకూలంగా ఉంది.

3 / 5
ఎలక్ట్రిక్ రంగంలో సుజుకి మార్క్: పెట్రోల్ ధరలు మండిపోతున్న వేళ, సుజుకి తన ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా రంగంలోకి దించింది.  ఇందులో శక్తివంతమైన 60 Ah, 3,072 kWh బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ ధృవీకరించింది. దీని ప్రారంభ ధర రూ.1,91,962. ఇకో ఫ్రెండ్లీ రైడింగ్ ఇష్టపడే వారికి ఇది మంచి ఆప్షన్.

4 / 5
గేమ్ ఛేంజర్ కాబోతున్న CNG వెర్షన్: త్వరలోనే స్కూటర్ మార్కెట్ రూపురేఖలను మార్చేస్తూ సుజుకి నుంచి CNG వెర్షన్ రాబోతున్నట్లు ఆటోమొబైల్ వర్గాల సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే, బజాజ్ ఫ్రీడమ్ తరహాలోనే స్కూటర్ సెగ్మెంట్‌లో ఇది ఒక విప్లవం కానుంది. ఒక కేజీ సీఎన్జీకి ఏకంగా 90 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని అంచనా. దీని ఎంట్రీ లెవల్ ధర సుమారు రూ.90,000 ఉండవచ్చని సమాచారం. సామాన్యుల జేబుకు చిల్లు పడకుండా, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే వీలు కలగనుంది.

5 / 5
Follow Us
వారెవ్వా.. 90 కి.మీ మైలేజ్‌తో సుజుకి నుంచి సూపర్ స్కూటీ..

ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..

సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు

రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!

బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?

పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే

అడ్డగోలుగా ఐపీఎల్ బెట్టింగ్స్.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్..

చపాతీల్లోకి చిటికెలో చేసుకునే పల్లెటూరి చేతి పచ్చడి..

కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా రూ.5 వేలు.. అదిరిపోయే పథకం..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్