AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజా కూతురికి 'Herman B Wells' అవార్డ్‌.. గర్వంతో పొంగిపోయిన రోజా

రోజా కూతురికి ‘Herman B Wells’ అవార్డ్‌.. గర్వంతో పొంగిపోయిన రోజా

Phani CH
|

Updated on: Apr 23, 2026 | 4:09 PM

Share

రోజా కూతురు అన్షు మాలిక అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇండియానా యూనివర్సిటీ నుండి 'హెర్మన్ బి వెల్స్' అవార్డును అందుకుంది. చదువుతో పాటు నాయకత్వం, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అత్యుత్తమ విద్యార్థులకు ఈ పురస్కారం లభిస్తుంది. అన్షు ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ చదువుతూ, కోడింగ్, వెబ్ డెవలప్‌మెంట్, 'ఆర్ట్ ఫర్ ఎ కాజ్' ద్వారా సామాజిక సేవలో కృషి చేస్తోంది. ఈ అరుదైన గౌరవం రోజా కుటుంబానికి గర్వకారణం.

సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా కూతురు అన్షు మాలిక మరో అరుదైన గౌరవం అందుకుంది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇండియానా యూనివర్సిటీ ఏటా ఒక్కరికి మాత్రమే ప్రదానం చేసే ‘హెర్మన్ బి వెల్స్’ అవార్డుకు అన్షు ఎంపికైంది. ఈ విషయాన్ని రోజానే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 1961 నుంచి ఇండియానా యూనివర్సిటీ ప్రతి సంవత్సరం ఒక అత్యుత్తమ విద్యార్థికి ఈ ప్రతిష్టాత్మకం ఈ పురస్కారం అందిస్తోంది. చదువుతో పాటు లీడర్ షిప్, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు.ప్రస్తుతం ఇదే యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేస్తోంది అన్షు. చదువుతో పాటు ఆమె కోడింగ్, వెబ్ డెవలప్‌మెంట్ వంటి అంశాలతో పాటు ‘ఆర్ట్ ఫర్ ఎ కాజ్’ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటోంది.దీంతో రోజా కూతురును.. ‘హెర్మన్ బి వెల్స్’ అవార్డుకు ఎంపిక చేసింది ఇండియానా యూనివర్సిటీ. ఈ అవార్డు అందుకున్న వారి పేర్లు ఇండియానా మెమోరియల్ యూనియన్‌లో శాశ్వతంగా ప్రదర్శితబడతాయి. ఇక ఈ గుడ్‌ న్యూస్‌తో పాటే.. తన భర్త, కూతురితో యూనివర్సిటీలో దిగిన ఫొటోలను అందరితో పంచుకున్న రోజా.. తన కూతురు ఘనతను చూసి ఎమోషనల్ అయ్యారు. ‘డియర్‌ అన్షు నీ కఠోర శ్రమ, అంకితభావం, ధైర్యం నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాయి. ఇది ఆరంభం మాత్రమే. ఒక చిన్న కలగా మొదలైన నీ ప్రయాణం ఇప్పుడు మాకు అపారమైన గర్వకారణంగా, ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.’ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చారు రోజా.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు రోజా కూతురికి అభినందనలు తెలుపుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుంతల రోడ్లతో చికాకు.. పోర్షే కారుపైనే సిమెంట్ కలిపిన యువకుడు..

Raaka: ఆందోళన వద్దు.. దీపిక వల్ల ‘రాకా’ ఆగదు

Rakasa OTT: సంగీత్ శోభన్.. రాకాస OTT అప్డేట్ !!

Chalaki Chanti: నా తర్వాత వచ్చిన సుడిగాలి స్టార్ అయ్యాడు !! కానీ నేను..

Assi Movie Review: మంచి కోర్టు రూమ్ డ్రామా..18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ

Follow Us