AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assi Movie Review: మంచి కోర్టు రూమ్ డ్రామా..18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ

Assi Movie Review: మంచి కోర్టు రూమ్ డ్రామా..18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ

Phani CH
|

Updated on: Apr 23, 2026 | 1:05 PM

Share

ZEE5లో విడుదలైన 'అస్సి' చిత్రం దేశంలో రోజుకు 80 అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రశ్నించే కోర్ట్ రూమ్ డ్రామా. బాధితులకు న్యాయం దక్కని తీరును, పోలీసుల-లాయర్ల సహకారాన్ని ఇది కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. అసభ్యత లేకుండానే భయం గొలిపే ఈ చిత్రం సమాజానికి ఆలోచింపజేసే బలమైన సందేశాన్నిస్తుంది. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ చూడదగ్గ మూవీ ఇది.

దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎందరో అభం శుభం తెలియని మహిళలు, ఆడపిల్లలు, చిన్నారులు అన్యాయానికి గురవుతున్నారు. వీళ్లలో చాలామందికి సరైన న్యాయం దక్కట్లేదు! ఈ అంశంపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి. అయితే దేశంలో రోజుకి 80 అత్యాచారాలు జరుగుతున్నాయనే కాన్సెప్ట్‌తో తీసిన లేటెస్ట్ హిందీ మూవీ ‘అస్సి’. రీసెంట్‌గా జీ5 ఓటీటీలోకి వచ్చిన ఈ హార్డ్ హిట్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా అందర్నీ ఆకట్టుకుంటోంది. అస్సి అంటే హిందీలో ఎనభై(80) అని అర్థం. అంటే మన దేశంలో రోజుకు దాదాపుగా 80 వరకు అత్యాచారాలు జరుగుతున్నాయని ఈ సినిమాతో దర్శకుడు అనుభవ్ సిన్హా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇందులో కళ్లు చెదిరిపోయే ట్విస్టులు ఉండవు. అద్భుతమైన విజువల్స్ కనిపించవు. కానీ చూస్తున్నంతసేపు మన పక్కనే జరిగినట్లు అనిపించే కథ, అంతా అయిపోయిన తర్వాత మనసుని బరువెక్కించే కథనం ఇందులో ఉంటుంది.కథ పరంగా చూస్తే రెగ్యులర్ రొటీన్ కోర్ట్ రూమ్ డ్రామాలానే అనిపిస్తుంది.కానీ తరచి చూస్తే ఎన్నో విషయాలు అర్థమవుతాయి. మొదలైన ఐదు నిమిషాలకే స్టోరీలోకి వెళ్లిపోతాం. అక్కడి నుంచి తర్వాత ఏమవుతుందా? నిందితులకు శిక్ష పడుతుందా లేదా అనేది చివరి వరకు ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. అత్యాచారానికి గురైన వాళ్లకు నిజమైన న్యాయం దక్కుతుందా? అసలు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టాలనే ఆలోచన ఎవరికైనా ఎందుకొస్తుంది? అనే ప్రశ్నలు ప్రేక్షకులకే వేసినట్లు అనిపిస్తుంది. పోలీసులు, లాయర్లు కుమ్మక్కై.. కొన్ని కొన్ని కేసుల్ని, అందులో సాక్ష్యాలని ఎలా తారుమారు చేస్తారనే విషయాన్ని అద్భుతంగా చూపించారు. అత్యాచారం సీన్ చూస్తున్నప్పుడు అసభ్యత ఎక్కడా కనిపించదు గానీ ఓ రకమైన భయం కలుగుతుంది. ఒకవేళ మన ఇంట్లోని ఆడవాళ్లకు ఇలా జరిగితే ఎలా? అని మనసులో అలజడి రేగుతుంది.సినిమాలో ప్రతి 20 నిమిషాలకు ఒకసారి రెడ్ స్క్రీన్ చూపిస్తారు. అంటే ఆ వ్యవధిలో ఎక్కడోఅక్కడ.. మరో అత్యాచారం జరుగుతుందని దర్శకుడు ఇలా సింబాలిక్‌ గా ఈ దారుణ నిజాన్ని మనకు చెప్పే ప్రయత్నం చేశాడు. క్లైమాక్స్‌లో స్కూల్ పిల్లలందరినీ ఎదురుగా కూర్చోబెట్టి జడ్జి తీర్పు ఇచ్చే సన్నివేశం బాగుంటుంది. ఈ సినిమాను 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ చూడాల్సిందే. వీలు దొరికితే మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: 80కోట్ల ఇంద్రభవనం రెడీ.. గృహప్రవేశమే తరువాయి?

Follow Us