AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుంతల రోడ్లతో చికాకు.. పోర్షే కారుపైనే సిమెంట్ కలిపిన యువకుడు..

గుంతల రోడ్లతో చికాకు.. పోర్షే కారుపైనే సిమెంట్ కలిపిన యువకుడు..

Phani CH
|

Updated on: Apr 23, 2026 | 4:07 PM

Share

బెంగళూరులోని గుంతల రోడ్లపై విసుగు చెందిన కోటీశ్వరుడు అఖిల్ హేమాద్రి వినూత్న నిరసన తెలిపాడు. తన ఖరీదైన పోర్షా కారు బానెట్‌పై సిమెంట్ మిశ్రమాన్ని కలిపి, రోడ్డు గుంతను తానే పూడ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలలో ఉన్న తీవ్ర అసంతృప్తిని స్పష్టంగా వెల్లడిస్తోంది.

బెంగళూరులోని గుంతల రోడ్లపై విసుగు చెందిన ఓ కోటీశ్వరుడు వెరైటీగా నిరసన తెలియచేశాడు. అధికారులు పట్టించుకోకపోవడంతో తనే స్వయంగా రంగంలోకి దిగాడు. ఏకంగా తన ఖరీదైన పోర్షా కారు బానెట్‌పైనే సిమెంట్ మిశ్రమాన్ని కలిపి, రోడ్డుపై ఉన్న గుంతను పూడ్చాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఖిల్ హేమాద్రి అనే వ్యాపారవేత్త తన ఎరుపు రంగు పోర్షా కారులో నిర్మాణ సామాగ్రితో దెబ్బతిన్న రోడ్డు దగ్గరికి చేరుకున్నాడు. ఆ తర్వాత, తన కారు బానెట్‌ నే సిమెంట్ కలపడానికి బేస్‌గా వాడుకున్నాడు. కోట్లు ఖరీదు చేసే విలాసవంతమైన కారును ఇలాంటి పనికి వాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. సిమెంట్‌ లో బిస్లెరీ బాటిల్‌ నీరు పోసి జాగ్రత్తగా మిశ్రమాన్ని కలిపాడు. గుంతలో వేసి రోడ్డును బాగు చేయడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత అదే బిస్లెరీ బాటిల్‌ నీటితో చేతులు కడుక్కున్నాడు. ఆ తర్వాత ప్లాస్టిక్‌ షీట్‌ను బోనెట్‌ పై నుంచి తీసి పక్కకు పడేశాడు. దాంతో అతని కారు బానెట్‌ ఎప్పటిలాగే మిలామిలా మెరిసింది. కారులో కూర్చుని డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. ఓ ఖరీదైన స్పోర్ట్స్ కారును రోడ్డు మరమ్మతు వంటి సాధారణ పనికి ఉపయోగించడం చూసి నెటిజన్లు షాకవుతున్నారు. బెంగుళూరులో తరచూ ఇబ్బందిపెట్టే గుంతల సమస్యపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తికి ఈ ఘటన అద్దం పడుతోందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అఖిల్ చేసిన పని వింతగా ఉన్నా, ఒక ముఖ్యమైన సమస్యను వెలుగులోకి తెచ్చిందని ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Raaka: ఆందోళన వద్దు.. దీపిక వల్ల ‘రాకా’ ఆగదు

Rakasa OTT: సంగీత్ శోభన్.. రాకాస OTT అప్డేట్ !!

Chalaki Chanti: నా తర్వాత వచ్చిన సుడిగాలి స్టార్ అయ్యాడు !! కానీ నేను..

Assi Movie Review: మంచి కోర్టు రూమ్ డ్రామా..18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ

TOP 9 ET News: 80కోట్ల ఇంద్రభవనం రెడీ.. గృహప్రవేశమే తరువాయి?

Follow Us