తమిళ వెట్రి కళగం అధినేత విజయ్ చెన్నైలోని నీలాంగరైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్టీ స్థాపన అనంతరం జరిగిన తొలి ఎన్నికలు కావడంతో ఇది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రజల మధ్య క్యూలో నిలబడి విజయ్ తన ప్రజాస్వామ్య బాధ్యతను చాటుకున్నారు.