AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెరకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎప్పుడు ఏది తాగాలో తెలుసా..?

మండుతున్న ఎండలతో ఈ వేడి నుంచి రిలీఫ్ కోసం మనం రోడ్డు పక్కన కనిపించే చెరకు రసం, కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసం వైపు పరుగులు తీస్తుంటాం. ఇవన్నీ దాహం తీర్చేవే కదా అని ఏది పడితే అది తాగేస్తున్నారా? అయితే ఆగండి.. ఈ మూడు డ్రింక్స్ శరీరానికి అందించే పోషకాలు, శక్తి వేర్వేరు. అలసిపోయినప్పుడు ఏది తాగాలి? వడదెబ్బ తగలకుండా ఏది రక్షిస్తుంది? అనే విషయాలు తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Apr 23, 2026 | 7:32 PM

Share
భానుడి భగభగలకు కేవలం నీరు తాగితే సరిపోదు.. శరీరానికి కావాల్సిన శక్తి, పోషకాలు కూడా అందాలి. ఎండ నుంచి ఉపశమనం కోసం మనం రోడ్డు పక్కన కనిపించే చెరకు రసం, నిమ్మరసం లేదా కొబ్బరి నీళ్లను ఆశ్రయిస్తుంటాం. అయితే ఈ మూడింటి ప్రయోజనాలు వేర్వేరు. మీ శరీర అవసరాన్ని బట్టి ఏ సమయంలో ఏది తాగాలో తెలిస్తే, వడదెబ్బ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

1 / 5
చెరకు రసం: మీరు ఎండలో బాగా ప్రయాణించి లేదా పని చేసి నీరసించిపోయారా? అయితే మీకు చెరకు రసం బెస్ట్ ఛాయిస్. ఇందులో ఉండే సహజ సిద్ధమైన చక్కెరలు, కార్బోహైడ్రేట్లు రక్తంలో త్వరగా కలిసిపోయి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. మధుమేహం ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది. అలాగే బయట తాగేటప్పుడు ఐస్ మరియు పరిశుభ్రత విషయంలో జాగ్రత్త వహించాలి.

2 / 5
నిమ్మరసం: అత్యంత చవకైన, అందరికీ అందుబాటులో ఉండే పానీయం నిమ్మరసం. విటమిన్-సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరం నుంచి విషతుల్యాలను బయటకు పంపి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలోనూ ఇది కీలకం. ఎసిడిటీ ఉన్నప్పుడు లేదా గొంతు ఎండిపోయినట్లు అనిపించినప్పుడు నిమ్మరసం తాగితే త్వరగా రీఫ్రెష్ అవుతారు.

3 / 5
కొబ్బరి నీళ్లు: ప్రకృతి అందించిన స్వచ్ఛమైన సెలైన్ బాటిల్ కొబ్బరి నీళ్లు. ఇందులో పొటాషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు మెండుగా ఉంటాయి. ఎండ వల్ల శరీరంలో తగ్గిన ఎలక్ట్రోలైట్లను భర్తీ చేయడంలో దీనికి సాటి లేదు. శరీరాన్ని లోపలి నుంచి చల్లబరిచి అలసటను తగ్గిస్తుంది. ఉదయం పూట లేదా వ్యాయామం చేసిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.

4 / 5
ఏది.. ఎప్పుడు తాగాలి?: ఉదయం, మధ్యాహ్నం బాడీ హైడ్రేటెడ్ గా ఉండటానికి కొబ్బరి నీళ్లు ఉత్తమం. తీవ్రమైన అలసట ఉన్నప్పుడు ఇన్స్టంట్ ఎనర్జీ కోసం చెరకు రసం ఎంచుకోండి. రోగనిరోధక శక్తి పెరగడానికి, ఎసిడిటీ తగ్గడానికి నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. వేసవిలో కేవలం దాహం తీర్చుకోవడమే కాదు, ఆరోగ్యంగా ఉండటం కూడా ముఖ్యం. ఈ సహజ పానీయాలను సరైన సమయంలో తీసుకుంటూ వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త పడండి.

5 / 5
Follow Us
కోజాగిరి పౌర్ణమి రాత్రి గుడ్లగూబ కనిపిస్తే శుభమా? లక్ష్మీదేవి..

SBI ఖాతాదారులకు అలర్ట్.. ఈ పని చేయకపోతే అకౌంట్ క్లోజ్

కెప్టెన్ కాకపోయినా నరేష్‌కు కెప్టెన్సీ రూమ్‌కు యాక్సెస్

నమన్ ధీర్ దెబ్బకు టీమిండియాలో ముగ్గురికి టెన్షన్

బాసర ట్రిపుల్ ఐటీలో నీటి కష్టాలు.. నవంబర్ 17 వరకు సెలవులు

కేవలం 7 రూపాయల టికెట్.. కూలీ భార్యను కోటీశ్వరాలిని చేసిన అదృష్టం!

కోజాగిరి పౌర్ణమి.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రోజు ఇలా పూజించండి

పుట్టగానే మీసాలతో రచ్చ చేస్తున్న బుడ్డొడు.. విచిత్ర వీడియో వైరల్‌

ధరల్లో స్వల్ప మార్పులు.. ఈ రోజు తులం ఎంతంటే?

ఏపీలో ముంచుకొస్తున్న తీవ్ర తుఫాన్.. ఇక భారీ వర్షాలే..