AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌పై భానుడి విశ్వరూపం.. రాబోయే ఐదు రోజుల్లో మాడు పగిలే ఎండలు.. బయటకెళ్లారో అంతే!

దేశవ్యాప్తంగా ఎండల ప్రభావం జన జీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేడి దేశంగా భారత్ మారింది. ఏప్రిల్ నెలలోనే ఎండల తీవ్రత మండిపోతోంది. భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే 4 నుంచి 8 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది ఈ సీజన్‌లో రికార్డు స్థాయి వేడిని సూచిస్తోంది.

Gopikrishna Meka
| Edited By: |

Updated on: Apr 23, 2026 | 7:00 PM

Share
భారత వాతావరణ శాఖ ప్రకారం రాబోయే 4-5 రోజులు ఏప్రిల్  27-28 వరకు ఉత్తర, మధ్య, తూర్పు భారత్‌లో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగనున్నాయి.ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర (విదర్భ), తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42-45°C వరకు చేరవచ్చు.ఢిల్లీలో ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

1 / 5
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత : ఇక తెలంగాణలో మార్చి నుంచే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఏప్రిల్-జూన్ మధ్య హీట్ వేవ్ రోజులు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఓవైపు అకాల వర్షాలు, ఉరుములు మెరుపులు పిడుగు పాటు పరిస్థితులతో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని స్పష్టం చేసింది. అటు ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలు మండలాల్లో తీవ్ర హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40-43 డిగ్రీల పైన ఉండే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో 95 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 100కి పైగా మండలాల్లో వడగాలులు వీచే సూచనలు ఉన్నాయని తెలిపింది.

2 / 5
ప్రపంచ స్థాయిలో భారత్ రికార్డు: ప్రపంచంలో అత్యంత వేడి నగరాల జాబితాలో బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ నగరాలు టాప్‌లో నిలిచాయని వాతావరణ శాఖ తెలిపింది. బిహార్లోని భాగల్పూర్, ఒడిశాలోని తాల్చేర్ , పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. బీహార్‌లోని బెగుసరాయ్, మోతిహారి, ముంగేర్, భోజ్‌పూర్, సివాన్ వంటి నగరాలు. పశ్చిమ బెంగాల్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు కూడా ఇదే స్థాయిలో వేడిని ఎదుర్కొంటున్నాయని పేర్కొంది.IMD ప్రకారం, ఏప్రిల్-జూన్ మధ్య దేశంలో సాధారణం కంటే ఎక్కువ హీట్ వేవ్ రోజులు ఉండవచ్చని అంచనా చేసింది.

3 / 5
ఎండ తీవ్రత నుంచి రక్షణ: ఈ ఎండల తీవ్రత నుంచి జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు, ఆరోగ్య శాఖ అధికారులు ఈ సూచనలు చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండాలని. తేలికపాటి రంగు బట్టలు ధరించాలని సూచిస్తున్నారు. తలకు క్యాప్ లేదా తడి గుడ్డ కప్పుకోవడం చెంపలు, మెడ ఎండ తగలకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

4 / 5
దాహం వేసినా వేయకపోయినా నీరు తాగాలని ఓఆర్‌ఎస్, నిమ్మరసం, మజ్జిగ వంటివి తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్‌ను నివారించవచ్చని సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, బయట పని చేసేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు..తలనొప్పి, మూర్ఛ, వాంతులు, శరీరం వేడెక్కడం వంటి హీట్ స్ట్రోక్  లక్షణాలు ఉంటే  వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు

5 / 5
Follow Us