AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నూనె తలకు తగిలితే చాలు.. జుట్టు ఒత్తుగా దృఢంగా పెరుగుతుంది.. బట్టతల రానే రాదు

జుట్టు రాలడం, పలుచబడటం వంటి సమస్యలకు మునగాకు నూనె సహజసిద్ధమైన పరిష్కారంగా ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి మునగాకు, కొబ్బరి నూనె, ఆముదంతో ఇంట్లోనే సులభంగా ఈ నూనె తయారు చేసుకుని క్రమం తప్పకుండా వాడితే జుట్టు కుదుళ్లు బలపడటంతో పాటు కొత్త జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.

ఈ నూనె తలకు తగిలితే చాలు.. జుట్టు ఒత్తుగా దృఢంగా పెరుగుతుంది.. బట్టతల రానే రాదు
Moringa Leaf Oil
Shaik Madar Saheb
|

Updated on: Aug 06, 2026 | 1:22 PM

Share

నేటి కాలంలో జుట్టు రాలడం, పెరుగుదల లేకపోవడం అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య. దువ్వెన పట్టి దువ్వగానే గుప్పెళ్ల కొద్దీ జుట్టు రాలిపోవడం, జుట్టు పలుచబడటం వంటివి ఆందోళన కలిగిస్తాయి. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన నూనెలు, షాంపూలు. ఈ ఉత్పత్తులలో చాలా వరకు నకిలీవి, జుట్టు ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు సూచిస్తున్నారు. జుట్టును ఆరోగ్యంగా, బలంగా మార్చుకోవడానికి ఇంటి వద్దే తయారు చేసుకునే స్వచ్ఛమైన నూనెలు, సహజసిద్ధమైన సంరక్షణ పద్ధతులు ఉత్తమ మార్గమని హెయిర్ కేర్ నిపుణులు చెబుతున్నారు.. మునగాకు నూనె అటువంటి గొప్ప పరిష్కారాలలో ఒకటి.. ఊడుతున్న జుట్టుకు మునగాకు నూనె గొప్ప వరంగా పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు..

మునగాకు నూనె తయారీ విధానం:

మునగాకులో జుట్టు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నూనెను తయారు చేయడానికి కొన్ని సులభమైన దశలు:

మునగాకు పేస్ట్: ఒక గుప్పెడు పచ్చి మునగాకును తీసుకొని, శుభ్రంగా కడిగి, కొద్దిగా నీటిని చేర్చి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి. ఎండు మునగాకు పొడికి బదులుగా పచ్చి మునగాకును వాడటం వల్ల పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి.

నూనె మిశ్రమం: ఒక గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన కొబ్బరి నూనెను తీసుకోవాలి. గానుగలో స్వయంగా పట్టించిన కొబ్బరి నూనెను వాడటం వల్ల అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి. దీనికి ఒక టేబుల్ స్పూన్ ఆముదం కలపాలి. ఆముదం జుట్టు పెరుగుదలకు, మందంగా మారడానికి సహాయపడుతుంది.

మరిగించడం: ఈ నూనె మిశ్రమాన్ని, ముందుగా సిద్ధం చేసుకున్న మునగాకు పేస్ట్‌ను కలిపి, చిన్న మంటపై స్టవ్ మీద పెట్టాలి. పెద్ద మంట పెడితే మునగాకు పేస్ట్ మాడిపోయే అవకాశం ఉంది. నిదానంగా కలుపుతూ మరిగించాలి. మునగాకులోని పోషకాలన్నీ నూనెలోకి చేరినప్పుడు, నూనె రంగు ఎరుపు రంగులోకి మారుతుంది.

వడకట్టడం: నూనె చల్లారిన తర్వాత, ఒక శుభ్రమైన వస్త్రం లేదా స్ట్రైనర్‌తో వడకట్టి, నూనెను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను ఎక్కువ కాలం నిల్వ చేయకుండా, రెండు సార్లు వాడకానికి సరిపడా తయారు చేసుకొని, అవసరమైనప్పుడు మళ్లీ చేసుకోవడం మంచిది.

వాడే విధానం – ముఖ్య చిట్కాలు:

అప్లికేషన్: తయారు చేసుకున్న మునగాకు నూనెను గోరువెచ్చగా ఉండేలా చూసుకొని తలకు, జుట్టుకు పట్టించాలి. నూనెను అప్లై చేస్తున్నప్పుడు, మసాజ్ చేయడం చాలా ముఖ్యం. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, నూనెలోని పోషకాలు కుదుళ్లలోకి బాగా చేరేలా చేస్తుంది.

ఆయిల్స్ మార్చి మార్చి వాడకం: ఒకే రకమైన నూనెను నిరంతరం వాడటం మంచిది కాదు. మునగాకు నూనెను వారంలో రెండు సార్లు వాడితే, మరో రెండు సార్లు కలొంజి, మెంతులతో తయారు చేసిన నూనెను వాడటం ద్వారా జుట్టుకు వివిధ రకాల పోషకాలు అందుతాయి.

సహజసిద్ధమైన షాంపూ: రసాయన షాంపూలకు బదులుగా కుంకుడుకాయ, శీకాయ వంటి సహజసిద్ధమైన ఉత్పత్తులను తలస్నానానికి ఉపయోగించాలి.

పిల్లో కవర్లు, దువ్వెనలు: వారంలో రెండు సార్లు పిల్లో కవర్లను శుభ్రం చేయాలి. ఇది తలపైన పేరుకుపోయే ధూళి, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అలాగే, ఒకే దువ్వెనను చాలా మంది వాడకూడదు. చెక్క దువ్వెనలు జుట్టుకు మంచివి.

హెయిర్ మాస్క్‌లు: వారానికి రెండు సార్లు సహజసిద్ధమైన హెయిర్ మాస్క్‌లను వేసుకోవడం వల్ల జుట్టుకు అదనపు పోషణ లభిస్తుంది.

ఈ పద్ధతులను పాటించడం ద్వారా జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా తగ్గించుకొని, ఒత్తుగా, ఆరోగ్యంగా, బౌన్సీగా ఉండే జుట్టును పొందవచ్చు. అలాగే.. బట్టతల రాకుండా కూడా చూసుకోవచ్చు.. స్వచ్ఛమైన ఉత్పత్తులు, సరైన సంరక్షణతో జుట్టు సౌందర్యాన్ని తిరిగి పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. మరి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంటే.. ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us