AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ఎంట్రీ..? గంభీర్ ఫేవరేట్ ప్లేయర్ ఇక ఇంటికే..!

VVS Laxman BCCI Chief Selector: బీసీసీఐ సెలక్షన్ కమిటీలో ఊహించని మార్పులు చోటుచేసుకోబోతున్నాయనే వార్తలు క్రీడాభిమానుల్లో తీవ్ర ఆసక్తి రేపుతున్నాయి. నిజంగానే లక్ష్మణ్ చీఫ్ సెలెక్టర్ పీఠం దక్కితే టీమిండియా జట్టు ఎంపిక తీరుతెన్నులు ఎలా మారతాయో వేచి చూడాలి.

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ఎంట్రీ..? గంభీర్ ఫేవరేట్ ప్లేయర్ ఇక ఇంటికే..!
Gmabhir Washing Ton Sundar
Venkata Chari
|

Updated on: Aug 06, 2026 | 1:05 PM

Share

VVS Laxman BCCI Chief Selector: భారత క్రికెట్ జట్టు ఎంపికల విషయంలో బీసీసీఐ సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలానికి త్వరలోనే మంగళం పాడేందుకు సిద్ధమవుతున్నట్లు క్రికెట్ వర్గాల్లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆయన స్థానంలో హైదరాబాద్ సొగసరి బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

అజిత్ అగార్కర్‌కు గుడ్ బై.. తెరపైకి హైదరాబాద్ స్టార్..!

2023 జూలై నెలలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అజిత్ అగార్కర్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించినందుకు ఆయనకు గతంలో పొడిగింపు లభించింది. 2026 జూన్ వరకు ఆయనకు గడువు ఇచ్చినా, రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ వరకు పదవిని పొడిగించేందుకు బోర్డు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.

ఇదికూడా చదవండి: స్వ్కాడ్‌లో ఈ 15మంది ఉంటే చాలు.. వద్దన్నా 2027 వన్డే వరల్డ్ కప్ పట్టుకొచ్చేస్తారంతే..!

ఇవి కూడా చదవండి

హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు బీసీసీఐ ఉన్నతాధికారులతో అగార్కర్‌కు విభేదాలు వస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్‌ను తదుపరి చీఫ్ సెలెక్టర్‌గా నియమించాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారు.

బోర్డు మద్దతు లక్ష్మణ్‌కే.. దిగ్గజాలతో సత్సంబంధాలే కలిసివచ్చేనా?

బీసీసీఐ అధికారుల్లో చాలామంది లక్ష్మణ్ వైపే మొగ్గు చూపుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లతో లక్ష్మణ్‌కు ఎంతో సుదీర్ఘ అనుబంధం ఉంది. అగార్కర్ కంటే లక్ష్మణ్ సీనియర్ కావడం, భారత జట్టులో ఎన్నో ఏళ్లపాటు దిగ్గజ ఆటగాడిగా కొనసాగడం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.

ఇదికూడా చదవండి: అమ్మాయిలతో జాగ్రత్త.. ఆ ఇద్దరిలా అస్సలు మారొద్దు.. వైభవ్ సూర్యవంశీకి మాజీ క్రికెటర్ హెచ్చరిక..!

సీనియర్ ఆటగాళ్లతో పాటు యంగ్ క్రికెటర్లను ఎలా హ్యాండిల్ చేయాలో లక్ష్మణ్‌కు బాగా తెలుసు. రోహిత్, విరాట్ సైతం లక్ష్మణ్ నిర్ణయాలకు గౌరవం ఇస్తారని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. ఈ కారణంతోనే సెలక్షన్ కమిటీ రథసారధిగా ఆయన పేరును దాదాపు ఖాయం చేసినట్లు తెలుస్తోంది.

గంభీర్‌కు ఎదురుదెబ్బ.. ఆ ఆల్‌రౌండర్‌కు స్థానం గండమేనా?

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కొందరు ఆటగాళ్లకు వరుస అవకాశాలు కల్పిస్తున్నారు. అందులో ప్రధానంగా తమిళనాడు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పేరు కనిపిస్తుంది. టెస్టుల్లో మినహా టీ20, వన్డేల్లో సుందర్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉన్నా గంభీర్ అతనికి నిరంతరం మద్దతుగా నిలుస్తున్నారు.

ఇదికూడా చదవండి: స్వ్కాడ్‌లో ఈ 15మంది ఉంటే చాలు.. వద్దన్నా 2027 వన్డే వరల్డ్ కప్ పట్టుకొచ్చేస్తారంతే..!

లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరిస్తే గంభీర్ ప్లాన్లకు పెద్ద గండి పడే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సుందర్ బౌలింగ్, బ్యాటింగ్ రెండూ నిరాశపరుస్తుండటంతో.. లక్ష్మణ్ రాకతో అతనికి జట్టులో చోటు దక్కడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us