అనకాపల్లి మరో రంగారెడ్డి కానుండి.. భారత్‌లోనే అగ్రస్థానానికి చేరుతుంది: సీఎం చంద్రబాబు
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.5,400 కోట్లతో 6.5 గిగావాట్ల రెన్యూ సోలార్ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాపల్లి ఇజిల్లా రాబోయే రోజుల్లో మరో రంగారెడ్డి జిల్లా కాబోతోందని.. ఇది దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందన్నారు. జిల్లాను భారీ పెట్టుబడుల కేంద్రంగా మారుస్తుందని, తద్వారా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 6.5 గిగావాట్ల రెన్యూ సోలార్ ఇన్‌గాట్-వేఫర్ ప్లాంట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా భారీ పెట్టుబడులతో అభివృద్ధిని ఆకర్షిస్తోందన్నారు. పెట్టుబడుల్లో ఈ జిల్లా భారత్‌లోనే అగ్రస్థానానికి చేరుతుందని.. ఇటీవలే ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ ఇండియా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగిందన్నారు. రూ.5,400 కోట్ల పెట్టుబడులతో రెన్యూ ఎనర్జీ సంస్థ 6.5 గిగావాట్ల ఇన్ గాట్ సోలార్ వేఫర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రంగారెడ్డి వెనుకబడిన ప్రాంతం. కానీ ఇప్పుడు ఆ జిల్లానే సంపద కలిగిన ప్రాంతం మారిందన్నారు. విశాఖ సమీపంలోని అనకాపల్లి మరో రంగారెడ్డి జిల్లాగా తయారవుతుందని ఆయన చెప్పుకొచ్చారు
అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం కుసుమ్ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ప్రతీ ఇంటిపైనా విద్యుత్ ఉత్పత్తి కోసం పీఎం సూర్యఘర్ కింద సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. 40 లక్షల ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. అటు రైతులు కూడా పీఎం కుసుమ్ కింద సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్ అక్కడే వాడుకునే పరిస్థితి ఉంటే ట్రాన్స్ మిషన్ నష్టాలు కూడా ఉండబోవన్నారు. గత పాలకులు వేసిన ట్రూ ఆప్ ఛార్జీలను ట్రూ డౌన్ చేశామని.. రూ.4,600 కోట్ల మేర భారాన్ని కూడా ప్రజలపై మోపకుండా ప్రభుత్వమే భరిస్తోందన్నారు.
రూ.15,795 కోట్లు ఛార్జీల భారం పెంచకుండా ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. గడచిన 22 నెలల్లో 802 ఎంయూలు చేసుకుని వాటిపై నిరంతరం సంప్రదింపులు చేస్తున్నామని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అనుమతులు ఇస్తున్నామన్నారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ద్వారా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. రూ.5,400 కోట్ల పెట్టుబడులతో యశ్వంత్ సిన్హా కుమారుడు ఈ రెన్యూ ఎనర్జీ ద్వారా ప్లాంట్ పెడితే తనను విశ్వసించిన యువతకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు.
గతంలో మాదరి ఇప్పుడు ఉద్యోగ, ఉపాధి కోసం ఎవరూ బయటకు వెళ్లాల్సిన అవసరమే లేదని. 2024లో వేసిన ఒక్క ఓటుతో ప్రజల్లో అభద్రత, ఆందోళనను తొలగించామన్నారు. ప్రకృతి వనరుల్ని దోచుకున్న పాలకులకు-వాటిని కాపాడే పాలకులకు ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలన్నారు. ఈ నెల 28 తేదీన 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయబోతున్నామన్నారు. జూలైలో భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రాబోతోందన్నారు. రూ.5వేల కోట్ల పెట్టుబడులతో లారస్ ల్యాబ్ ముందుకొస్తుందన్నారు.
ప్రధాని మోదీ సహకారంతో విశాఖ ఉక్కును కాపాడుకున్నామని.. రైల్వే జోన్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నామన్నారు. విశాఖ రాజమహేంద్రవరం మధ్య నాలుగు రైల్వేలైన్లు కార్గో కోసం స్పీడ్ రైల్ కారిడార్ వస్తోందని.. రాజధాని అమరావతి నిర్మాణంతో రాష్ట్ర దశాదిశ మారుతుందన్నారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామన్నారు. విశాఖ సహా 9 జిల్లాలు, అమరావతి కేంద్రంగా పశ్చిమగోదావరి నుంచి ప్రకాశం వరకూ, తిరుపతి కేంద్రంగా రాయలసీమ అంతటా వివిధ రీజియన్లుగా అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
