AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Savitri: సావిత్రికి ఆ స్టార్ హీరో చాలా స్పెషల్.. మహానటి ప్రేమగా బావా అని పిలిచే ఆ తెలుగు నటుడు ఎవరో తెలుసా?

మంచి తనానికి మారుపేరైన మహానటి సావిత్రి తన తోటీ నటీనటులకు ఎంతో గౌరవవిచ్చేది. తన సినిమా కెరీర్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అందాల తార ఒక తెలుగు హీరోను మాత్రం ప్రేమగా బావ అని పిలిచేదట.

Savitri: సావిత్రికి ఆ స్టార్ హీరో చాలా స్పెషల్.. మహానటి ప్రేమగా బావా అని పిలిచే ఆ తెలుగు నటుడు ఎవరో తెలుసా?
Savitri
Basha Shek
|

Updated on: Apr 23, 2026 | 7:42 PM

Share

మహానటి సావిత్రి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి సుమారు 45 ఏళ్లైనా ఆమె సినిమాల రూపంలో ప్రేక్షకుల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. ఈ జనరేషన్ కూడా సావిత్రి గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారంటే ఆమె గొప్పతనం ఏపాటిదో ఇట్టే అర్థమవుతోంది. సుమారు 30 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి సేవలందించారామె. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే సినిమాల్లో స్టార్ నటిగా వెలుగొందిన ఆమె వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. కుటుంబ సభ్యులను కాదని అప్పటికే పెళ్లై, పిల్లలు ఉన్న తమిళ నటుడు జెమినీ గణేషన్‌ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సావిత్రి. కానీ ఆ బంధం కూడా నిలవలేకపోయింది. దీంతో ఆమె ఎంతో బాధపడ్డారు. మానసిక వేధన అనుభవించారు. చివరకు 45 ఏళ్ల వయసులోనే ఈ లోకం నుంచి నిష్ర్కమించారు. సినిమాల పరంగానైనా, వ్యక్తిగత జీవిత పరంగానైనా సావిత్రి జీవితం నేటి తరానికి ఒక మంచి గుణపాఠంగా చెప్పుకోవచ్చు.

ఇదిలా ఉంటే ఈ మధ్యన సావిత్రికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెతో కలిసి నటించిన కొందరు నటులు, నటీమణులు మహానటి గురించి తెలియని కొన్ని నిజాలను పంచుకుంటున్నారు. సావిత్రికి తన చుట్టూ ఉన్న వాళ్లను ఎంతో బాగా చూసుకనేవారట. చేయి చాచి అడిగిన వారికి కాదనకుండ సహాయం చేసేవారట. అలాగే తన తోటి నటీనటులుకు ఎంతో గౌరవం ఇచ్చేదట. సావిత్రికి చిన్నప్పటి నుంచి ఏఎన్నార్‌ అంటే బాగా ఇష్టం. ఆయనను గురువుగా భావించే వారట. సెట్ లో కూడా ఏఎన్నార్ ను గురువు గారు అని పిలిచేవారట. అదే సమయంలో మరో సీనియర్ నటుడు జగ్గయ్యను బావా అని పిలిచేదట సావిత్రి. షూటింగ్ సెట్‌లో నూ `బావా.. బావా` అని పిలుస్తూ ఆటపట్టించేదట. ఈ విషయాన్ని సీనియర్‌ నటి జమున ఒక సందర్భంలో వెల్లడించారు.

నటుడు జగ్గయ్యని సావిత్రి బావా అని పిలవడానికి ఒక కారణముంది. అదేంటంటే.. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే సావిత్రికి జగ్గయ్య పరిచయం ఉందట. వీరిద్దరు కలిసి నాటకాలు వేసేవారట. అలా నాటకాల నుంచి ఆయనను బావా బావా అని పిలిచేదట సావిత్రి. ఇండస్ట్రీలోకి వచ్చాక కూడా జగ్గయ్యను అలాగే ఆట పట్టించేదట. కాగా సావిత్రి, జగ్గయ్య పలు సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

జగ్గయ్యతో మహానటి సావిత్రి

Jaggayya, Savitri

Jaggayya, Savitri

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us