AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs CSK : వాంఖడేలో ముంబై vs చెన్నై సమరం.. టాస్ గెలిచిన హార్దిక్.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే

MI vs CSK : ముంబైలోని వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. రాత్రి వేళ మంచు కురిసే అవకాశం ఉండటం, అలాగే చేజింగ్‌లో ముంబైకి ఉన్న అద్భుతమైన రికార్డును దృష్టిలో పెట్టుకుని హార్దిక్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

MI vs CSK : వాంఖడేలో ముంబై vs చెన్నై సమరం.. టాస్ గెలిచిన హార్దిక్.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే
Mi Vs Csk Live Score
Rakesh
|

Updated on: Apr 23, 2026 | 7:27 PM

Share

MI vs CSK : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత భారీ పోరుకు సమయం ఆసన్నమైంది. క్రికెట్ ప్రపంచంలో ఎల్-క్లాసికోగా పిలవబడే ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య 33వ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఏమాత్రం ఆలోచించకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో అందరూ ఆశగా ఎదురుచూసిన ఇద్దరు దిగ్గజాలు రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీలు బరిలోకి దిగకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

టాస్ అప్‌డేట్ – ముంబై ఫీల్డింగ్

ముంబైలోని వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. రాత్రి వేళ మంచు కురిసే అవకాశం ఉండటం, అలాగే చేజింగ్‌లో ముంబైకి ఉన్న అద్భుతమైన రికార్డును దృష్టిలో పెట్టుకుని హార్దిక్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా తాము టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునే వాళ్లమని, అయితే మొదట బ్యాటింగ్ చేయడం కూడా తమకు ఇష్టమేనని పేర్కొన్నాడు.

రోహిత్, ధోనీల పరిస్థితి ఏంటి?

ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ (హ్యామ్‌స్ట్రింగ్ గాయం), ఎంఎస్ ధోనీ (కాలి కండరాల గాయం) కోలుకుంటున్నారని, బరిలోకి దిగే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ, తుది జట్టులో ఇద్దరి పేర్లు లేవు. రోహిత్ శర్మ ఈ సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడినా, ప్రస్తుత గాయం వల్ల విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇక ధోనీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఇద్దరూ కోలుకుంటున్నారని, త్వరలోనే మైదానంలోకి వస్తారని టీమ్ మేనేజ్‌మెంట్ ధీమా వ్యక్తం చేసింది.

తుది జట్లలో మార్పులు

ముంబై ఇండియన్స్ తన గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 99 పరుగుల తేడాతో ఓడించిన ఊపులో ఉండటంతో, తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. అటు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఒక కీలక మార్పు చేసింది. మ్యాథ్యూ షార్ట్ స్థానంలో ప్రశాంత్ వీర్‌ను జట్టులోకి తీసుకుంది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయిన చెన్నై, ఈ మ్యాచ్‌తో మళ్లీ విజయాల బాట పట్టాలని చూస్తోంది.

తిలక్ వర్మపై భారీ అంచనాలు

యువ బ్యాటర్ తిలక్ వర్మ గత మ్యాచ్‌లో 45 బంతుల్లో 101 పరుగులతో వీరవిహారం చేశాడు. నేటి మ్యాచ్‌లో కూడా ఆయనపైనే ముంబై ఆశలన్నీ ఉన్నాయి. చెన్నై బౌలర్లను తిలక్ ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక పాయింట్ల పట్టికలో ముంబై 7వ స్థానంలో, చెన్నై 8వ స్థానంలో ఉన్నాయి. రెండు జట్లకు కూడా ఈ గెలుపు అత్యంత కీలకం.

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

క్వింటన్ డికాక్ (WK), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (C), తిలక్ వర్మ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ శాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా, క్రిష్ భగత్, అల్లా గజన్ఫర్, అశ్విని కుమార్.

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

సంజూ శాంసన్ (WK), రుతురాజ్ గైక్వాడ్ (C), సర్ఫరాజ్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ముఖేష్ చౌదరి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us