AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమంటే ఇదేరా..? చనిపోయిన కోడి కోసం తల్లడిల్లిన మరో కోడి.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు

కోడికి అంత్యక్రియలు చేయడం ఎక్కడైనా చూశారా..? అవును.. అల్లారు ముద్దుగా పెంచుకున్న టర్కీ కోళ్లలో ఓ కోడి చనిపోతే.. మరో కోడి మృతిచెందిన కోడిపై పడి పదేపదే లేపుతూ తల్లడిల్లడం ప్రతి ఒక్కరి హృదయాలను చెలింపచేసింది.. ఆ తండా వాసులను కంటతడి పెట్టించింది.

ప్రేమంటే ఇదేరా..? చనిపోయిన కోడి కోసం తల్లడిల్లిన మరో కోడి.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు
Turkey Chicken's Funeral
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Mar 03, 2026 | 7:01 PM

Share

కోడికి అంత్యక్రియలు చేయడం ఎక్కడైనా చూశారా..? అవును.. అల్లారు ముద్దుగా పెంచుకున్న టర్కీ కోళ్లలో ఓ కోడి చనిపోతే.. మరో కోడి మృతిచెందిన కోడిపై పడి పదేపదే లేపుతూ తల్లడిల్లడం ప్రతి ఒక్కరి హృదయాలను చెలింపచేసింది.. ఆ తండా వాసులను కంటతడి పెట్టించింది. చివరకు.. ఆ టర్కీ కోడిని పెంచుకుంటున్న యాజమాని చనిపోయిన కోడికి అంతిమ సంస్కారాలు చేసి రుణం తీర్చుకున్నాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా లక్ష్మీపురం శివారు గమ్య తండాలో జరిగింది. భూక్యా వీరన్న అనే గిరిజన రైతు రెండేళ్ల క్రీతం రెండు టర్కీ కోడి పిల్లలను తెచ్చుకొని పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్నాడు.

2 కోళ్లు తమకు విశ్వాసమైన పెంపుడు జంతువులుగా మారాయి.. వాటిని తమ కుటుంబసభ్యుల వలే.. అపురూపంగా పెంచుకుంటున్నారు. ఆ రెండు టర్కీ కోళ్లు తోబుట్టువులా అత్యంత ఆప్యాయంగా పెరుగుతున్నాయి.. వాటిలో ఓ కోడి హఠాత్తుగా మృతి చెందింది.. ఈ క్రమంలో ఊహించని సన్నివేశం తండా వాసులను తల్లడిల్లిపోయేలా చేసింది. తనతో కలసి మెలసి తిరిగిన కోడి మరణాన్ని తట్టుకోలేని మరో కోడి.. మృతి చెందిన కోడిని పదేపదే లేపుతూ కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రేమ ఆప్యాయతలు, అనుబంధాలు మనుషుల్లోనే కాదు.. మూగ జీవుల్లోను ఉంటాయాని నిరూపించింది ఈ టర్కీ కోడి..

వీడియో చూడండి..

మృతి చెందిన కోడికి అతిమ సంస్కారాలు చేసిన యాజమాని దాని రుణం తీర్చుకున్నాడు.. అయితే.. అంతిమ సంస్కారాలు చేస్తున్న సమయంలో ఇంటినుంచి మృతిచెందిన కోడిని తీసుకెళ్తుంటే మరొకోడి వెంబడించిన తీరు తండావాసులను కన్నీరు పెట్టించింది. మృతిచెందిన కోడికి అంత్యక్రియలు నిర్వహించి వీరన్న దంపతులు.. తమ పెంపుడు జంతువు పై మమకారం చాటుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ