ప్రాణాంతక క్యాన్సర్ మహమ్మారి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. పర్యావరణం, జన్యుమార్పులు ఈ వ్యాధి బారిన పడేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి
TV9 Telugu
వీటితో పాటు మనం తీసుకునే ఆహారం కూడా సైటెంట్ కిల్లర్‌లా ప్రాణాలను హరిస్తుంది. అవును.. ఆహారం కూడా క్యాన్సర్ బారిన పడేలా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు
TV9 Telugu
ఇందుకు కారణమైన ఈ కింది ఆహారాలను తినడం మానుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదానికి ఆమడ దూరంలో ఉండొచ్చు. అందులో ముఖ్యమైనది ప్రాసెస్ చేసిన మాంసం
TV9 Telugu
ప్రాసెస్ చేసిన మాంసంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ ప్రాసెస్ చేసిన మాంసం గ్రూప్ 1 క్యాన్సర్ కారకాలతో నిండి ఉంటుంది. ఇది పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశం పెంచుతుంది
TV9 Telugu
ఈ మాంసంలో ఉండే నైట్రేట్లు, ప్రిజర్వేటివ్స్ పేగు లైనింగ్ కణాలను దెబ్బతీసి, క్యాన్సర్ మార్పులను ప్రోత్సహిస్తాయి. బదులుగా చిక్కుళ్ళు, కాయధాన్యాలు, మొక్క ఆధారిత ప్రోటీన్ ను తీసుకోవడం మంచిది
TV9 Telugu
అలాగే ఫ్లేవర్ డ్రింక్స్, అధిక చక్కెరలు ఉండే శీతల పానీయాలు రక్తంలో చక్కెర స్థాయిలతో పాటు దీర్ఘకాలిక మంటను పెంచుతాయి. ఇవి క్యాన్సర్ పురోగతిని కూడా వేగవంతం చేస్తాయి
TV9 Telugu
డీప్ ఫ్రై చేసిన ఆహారాలు ముఖ్యంగా తిరిగి ఉపయోగించిన నూనెలో చేసిన ఆహారాల్లో అక్రిలామైడ్ ఏర్పడుతుంది. ఇది వాపును ప్రేరేపించే, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే సమ్మేళనం కలిగి ఉంటాయి
TV9 Telugu
డీప్ ప్రై చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల క్యాన్సర్ కు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. కనుక వీటికి బదులుగా కాల్చిన కూరగాయలు, ఆవిరి మీద ఉడికించి తినడం మంచిది