AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో భగవంతుడా.. భారత్‌లో ఏటా 6ల‌క్షల చిన్నారుల్లో పుట్టుక‌తోనే లోపాలు.. షాకింగ్ రిపోర్ట్..

Infant health in India: దేశంలో పుట్టే బిడ్డల ఆరోగ్యానికి సంబంధించి.. ఆందోళన చెందే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది చిన్నారులు పుట్టుకతోనే వివిధ రకాల అనారోగ్య సమస్యలతో జన్మిస్తున్నారు అని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పుట్టుకతో వచ్చే లోపాల వల్ల జరిగే మరణాల్లో 16 శాతం వాటా భారత్‌దే కావడం ఆందోళన కలిగించే విషయంగా పేర్కొంటున్నారు.

అయ్యో భగవంతుడా.. భారత్‌లో ఏటా 6ల‌క్షల చిన్నారుల్లో పుట్టుక‌తోనే లోపాలు.. షాకింగ్ రిపోర్ట్..
Child Health
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Mar 03, 2026 | 5:00 PM

Share

దేశంలో పుట్టే బిడ్డల ఆరోగ్యానికి సంబంధించి.. ఆందోళన చెందే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది చిన్నారులు పుట్టుకతోనే వివిధ రకాల అనారోగ్య సమస్యలతో జన్మిస్తున్నారు అని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పుట్టుకతో వచ్చే లోపాల వల్ల జరిగే మరణాల్లో 16 శాతం వాటా భారత్‌దే కావడం ఆందోళన కలిగించే విషయంగా పేర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం మన దేశంలో దాదాపు 6 లక్షల మంది పుట్టే పిల్లలు పుట్టుకతో వచ్చే లోపాలతో జన్మిస్తున్నారు. అంటువ్యాధుల వల్ల కలిగే శిశు మరణాలు తగ్గుతున్నప్పటికీ, ఈ శారీరక లోపాల వల్ల సంభవించే మరణాల శాతం పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంత పెద్ద సమస్య ఉన్నా, ఈ బాధితులను ట్రాక్ చేయడానికి లేదా డేటాను విశ్లేషించడానికి మన దేశంలో ఇప్పటికీ జాతీయ స్థాయి రిజిస్ట్రీ లేదు. వాస్తవానికి నవజాత శిశువులు అనారోగ్య సమస్యలతో పురిటిలోనే ఎక్కువగా చనిపోతున్నారని.. ఇంకా చాలా మంది పలు సమస్యలతో బాధపడుతున్నట్లు అధ్యయనం వెల్లడించింది.

గుండె సంబంధిత వ్యాధులు, గ్రహణం మొర్రి, వెన్నెముక లోపాలు, డౌన్ సిండ్రోమ్, జన్యులోపాలు, చూపు, వినికిడి లోపాల తో ఎక్కువ మంది జననిస్తున్నారు. ఈ సమస్యను సీరియస్‌గా తీసుకున్న స్మైల్ ట్రైన్ ఇండియా, బర్త్ డిఫెక్ట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఢిల్లీలో బర్త్ అనోమలీస్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా ను ప్రారంభించాయి. ఇలా జాతీయ స్థాయి రిజిస్ట్రీని ఏర్పాటు చేయడం ద్వారా లోపాలకు గల కారణాలను గుర్తించడం వీలు అవుతుంది. తద్వారా గర్భధారణ సమయంలోనే స్కానింగ్ ద్వారా వీటిని గుర్తిస్తే, చాలా వరకు నయం చేసే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెరుగైన సౌకర్యాలు కేవలం నగరాలకే పరిమితం కాకుండా గ్రామాల్లోనూ ఈ చిన్నారులకు వైద్య సదుపాయాలు అందేలా చూడటం వల్ల ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు.

పుట్టుకతో వచ్చే లోపాలు శాపం కాదని, సరైన సమయంలో గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటన్నింటి కోసం.. ప్రభుత్వం తక్షణమే జాతీయ రిజిస్ట్రీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్