AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చుకు తినేయండి.. అద్భుత ప్రయోజనాలివే!

పరిమాణంలో చిన్నవిగా కనిపించే ఈ బ్లూబెర్రీలు పోషకాల గని అని చెప్పవచ్చు. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C, K, పీచు పదార్థం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మెదడు చురుకుదనాన్ని పెంచి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. చిన్న సైజులో, నీలం రంగులో ఆకర్షణీయంగా కనిపించే బ్లూబెర్రీలు కేవలం రుచికరమైన పండ్లు మాత్రమే కాదు, ఇవి శరీరానికి మేలు చేసే సూపర్ ఫుడ్స్ లో ఒకటి. ప్రతి ఏటా బ్లూబెర్రీల విశిష్టతను, ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Jul 22, 2026 | 10:15 PM

Share
అద్భుతమైన యాంటీఆక్సిడెంట్లు: పండ్లలో బ్లూబెర్రీలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిలో ఉండే ఆంథోసైనిన్లు అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఉచిత రాడికల్స్ నుంచి కణాలను రక్షించి నిరోధక శక్తిని పెంచుతాయి.

1 / 5
గుండె ఆరోగ్యానికి మేలు: రెగ్యులర్‌గా బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి, రక్తపోటు (BP) అదుపులో ఉంటుంది. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.

2 / 5
మెదడు చురుకుదనం, జ్ఞాపకశక్తి: బ్లూబెర్రీస్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు సమస్యల నుంచి రక్షణ నిస్తాయి. పిల్లలలో ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచడంలో ఇవి సహాయపడతాయి.

3 / 5
బరువు నియంత్రణ, జీర్ణక్రియ: వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ (పీచు పదార్థం) మెండుగా ఉంటుంది. ఇవి తిన్నప్పుడు కడుపు నిండిన భావన కలిగి, త్వరగా ఆకలి వేయదు. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా ఇవి తోడ్పడతాయి.

4 / 5
బెర్రీలతో చేసుకునే సులువైన హెల్తీ వంటకాలు చేసుకోవచ్చు. బ్లూబెర్రీ స్మూతీ, ఓట్‌మీల్ విత్ బ్లూబెర్రీస్, బ్లూబెర్రీ సలాడ్, ప్రతిరోజూ కొద్దిమొత్తంలో బ్లూబెర్రీలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా నిత్య యవ్వనంతో పాటు అద్భుతమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు!

5 / 5
Follow Us