ఢిల్లీలో CJP ఆందోళనలపై కేంద్ర నిఘా వర్గాల అనుమానాలు!
ఇండియా అన్‌లిమిటెడ్.. ఇండియా అన్‌స్టాపబుల్.. ఇండియా అన్‌బీటబుల్.. విశాలమైన భూభాగం, పెరుగుతున్న యువ జనాభా, అనుకూలమైన భౌగోళిక స్థితి, పవర్‌ఫుల్ డెమొక్రసీ, పటిష్టమైన సైనిక శక్తి, సురక్షితమైన విదేశాంగ విధానం.. ఇలా భారతదేశానికి ఉన్న సూపర్ స్పెషాలిటీస్ గురించి చాలానే చెప్పుకోవచ్చు. పైగా, ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. మన ఐటీ ప్రొఫెషనల్స్ సోకాల్డ్ అగ్రరాజ్యాలకు ఆక్సిజన్ అవుతున్నారు. ఒక రకంగా 'గ్లోబల్ సౌత్' మొత్తాన్నీ లీడ్ చేస్తోంది హమారా భారత్. అమెరికా, రష్యా, యూరోపియన్ కంట్రీస్‌తో బలమైన దౌత్య సంబంధాలతో పూర్తిగా సేఫ్‌జోన్‌లో ఉంది భారత్. ముఖ్యంగా అతితక్కువ యుద్ధభయం ఉన్న దేశంగా చెప్పుకోవచ్చు. ఉపఖండం చుట్టూ శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడిగి, రాజకీయ స్థిరత్వం లేక ప్రపంచం ముందు చులకనైపోయినా.. భారతదేశం మాత్రం దశాబ్దాల తరబడి స్టెబుల్‌గా స్టాండర్డ్‌గా నిలబడింది. అందుకే, ఎక్కడో ఎవ్వడికో కన్నుకుట్టింది. లేక ఎటు నుంచైనా దిష్టి తగిలుండొచ్చు. ఇంటర్నల్ ఇండియా కొద్దికొద్దిగా వేడెక్కుతున్నట్టుంది. వారం పది రోజులుగా తడబడుతున్నట్టుంది లాఅండ్ ఆర్డర్. హాట్‌హాట్‌గా మారిన ఢిల్లీ ఫైల్స్.. నిఘా వర్గాలు ఏం చెబుతున్నాయి?

పసిఫిక్ మహా సముద్రం మీదుగా ఎల్‌నినో భూతం తరుముకొస్తోంది, వానల్లేక రైతు చితికిపోతున్నాడు. తిండి గింజలక్కూడా నోచుకోక కోట్లాదిమంది కడుపులు నకనకలాడిపోతాయని కరువు సీన్లను ఊహించుకుని దేశం మొత్తం బెంబేలెత్తిపోతోంది. అది భవిష్యత్తులో దాపురించే ఆకలి సమస్య – పంటిబిగువున భరిస్తాం.. ఎలాగోలా నెట్టుకొస్తాం. కానీ, ఇప్పుడు పొంచి ఉంది జాతీయ అంతర్గత సమస్య. చిన్నసైజు శాంతిభద్రతల సంక్షోభం. ఇది పెద్ద సైజు కాకముందే మేలుకోవాలి. దేశ సార్వభౌమాధిపత్యాన్ని నిలబెట్టి నేరుగా ప్రశ్నిస్తున్న ఈ పరిస్థితి ఇంకా ముదిరితే పెనుప్రమాదం తప్పదు. అందుకే, మొగ్గలోనే తుంచడమెలా అని సోచాయిస్తోంది కేంద్రం. కానీ, ఇది జస్ట్‌లైక్ దట్ అలా పుట్టిన మూమెంట్ కాదు.. బ్యాక్‌డ్రాప్‌లో పెద్ద కుట్రే ఉండొచ్చని అనుమానిస్తోంది ఇండియన్ ఇంటిలిజెన్స్. దేశంలో దొంగలు పడ్డారా? దేశాన్ని అస్థిరపరచడానికి విదేశీ శక్తులు కుయుక్తులు పన్నుతున్నారా? భారతదేశాన్ని మరో శ్రీలంక, మరో నేపాల్, మరో బంగ్లాదేశ్‌లా రావణకాష్టంగా మార్చాలని కుట్ర చేస్తున్నారా? ఒక్కటొక్కటిగా బ్రేకింగ్ న్యూస్ వింటున్న కొద్దీ జనం మెదళ్లలో పెద్దపెద్ద ప్రశ్నలే పుడుతున్నాయి. 2026, జూలై 20 సాయంత్రం.. ఢిల్లీ జన్‌పథ్ నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వైపు దారితీసే రోడ్లపై రణరంగం సీన్లు. కన్నాట్ ప్లేస్ సర్కిల్ – పిండ్ బలూచి దగ్గర రాళ్లు, కర్రలతో ఎటుచూసినా భయానకం.. ధ్వంస రచనలో గాయపడ్డ పోలీసులు, నుగ్గునుగ్గయిన పోలీస్ వాహనాలు. జూలై 21 మధ్యాహ్నం.. సెవెన్ లోక్‌కల్యాణ్‌మార్గ్ – ఢిల్లీ.. పీఎం అఫీషియల్ రెసిడెన్స్. మూడు...
