AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఆర్ఎస్ఎస్ ప్రచారక్ టు హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్.. మోదీ అన్‌స్టాపబుల్ జర్నీ..

భారత రాజకీయ చరిత్రలో నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ ప్రస్థానం ఒక సంచలనం. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన ఆయన ప్రయాణం ఎన్నో వ్యూహాలు, పోరాటాలు, సంక్షోభాల సమాహారం.

PM Modi: ఆర్ఎస్ఎస్ ప్రచారక్ టు హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్.. మోదీ అన్‌స్టాపబుల్ జర్నీ..
Narendra Modi Political JourneyImage Credit source: AI Image
Krishna S
|

Updated on: Sep 17, 2026 | 10:03 PM

Share

సాధారణ టీ అమ్మే కుటుంబం నుంచి దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం.. వరుసగా మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించడం.. ఇది నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ ప్రస్థానం. మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా, ఆయన ఆరెస్సెస్ కార్యకర్త స్థాయి నుంచి దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన అగ్రనేతగా ఎలా ఎదిగారో ఒక్కసారి తిరిగి చూస్తే ఎన్నో ఆసక్తికర మలుపులు కనిపిస్తాయి. గుజరాత్‌లోని మెహసానా జిల్లా వడ్నగర్‌లో సామాన్య కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోదీ, చిన్నతనంలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వైపు ఆకర్షితులయ్యారు. 1970లలో సంఘ్ పూర్తిస్థాయి ప్రచారక్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాతంలో ఉంటూ ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఆరెస్సెస్ తరఫున కీలక పాత్ర పోషించారు. ఈ దశలోనే ఆయనలోని సంస్థాగత నైపుణ్యం, క్రమశిక్షణ, వ్యూహాత్మక ఆలోచనలు రూపుదిద్దుకున్నాయి. బీజేపీలోకి ఎంట్రీ: తిరుగులేని ఎన్నికల వ్యూహకర్త 1980ల చివర్లో ఆరెస్సెస్ నుంచి బీజేపీలోకి మారిన మోదీ, పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఎల్‌కే అద్వానీ చేపట్టిన చారిత్రక రథయాత్ర , మురళీ మనోహర్ జోషి చేపట్టిన ఏక్తా యాత్ర నిర్వహణ బాధ్యతలను మోదీ విజయవంతంగా నిర్వర్తించారు. సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా హర్యానా, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసి తిరుగులేని ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2001 భూకంపం సంక్షోభం.. గుజరాత్ సీఎంగా అధికార పగ్గాలు 2001లో గుజరాత్ భుజ్ భూకంపం తర్వాత ఏర్పడిన రాజకీయ సంక్షోభంలో కేషుభాయ్ పటేల్ స్థానంలో...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి