AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Song: 1991లో సంచలనం.. అప్పట్లో కుర్రాళ్లు తెగ పాడుకున్న వెంకటేశ్ సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్ షేక్..

ఒకప్పుడు నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. అంతేకాదు.. అప్పట్లో పాటలు సైతం థియేటర్లలో సంచలనం సృష్టించాయి. కాలం మారినా.. తరాలు మారినా.. ఇప్పటికీ ఆ సాంగ్స్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓ సాంగ్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. దాదాపు 30 ఏళ్లకు పైగా ఈ సాంగ్ కుర్రాళ్ల హాట్ ఫేవరేట్ అనే చెప్పాలి.

Telugu Song: 1991లో సంచలనం.. అప్పట్లో కుర్రాళ్లు తెగ పాడుకున్న వెంకటేశ్ సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్ షేక్..
Kotta Kottaga Unnadi Song
Rajitha Chanti
|

Updated on: Jul 22, 2026 | 10:16 PM

Share

తెలుగు సినిమా చరిత్రలో ఎవర్ గ్రీన్ చార్ట్ బస్టర్ సాంగ్స్‌ చాలా ఉన్నాయి. దశాబ్దాలు గడిచినప్పటికీ ఆ పాటల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ కొన్ని పాటలు శ్రోతల హృదయాల్లో నిలిచిపోయాయి. తాజాగా ఓ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో దూసుకుపోతుంది. అదే ‘కూలీ నెం. 1’ చిత్రంలోని “కొత్త కొత్తగా ఉన్నది” పాట ఒకటి. విక్టరీ వెంకటేష్, అందాల భామ టబు జంటగా నటించిన ఈ రొమాంటిక్ మెలోడీ ఇప్పటికీ సంగీతాభిమానులను విశేషంగా అలరిస్తూనే ఉంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, యూట్యూబ్‌లో ఈ వీడియో సాంగ్ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చి టాలీవుడ్ మ్యూజిక్ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పాటకి స్వరాలందించిన సంగీత దర్శకుడు ఇళయరాజా అందించిన మెలోడీ అద్భుతం. ప్రతి స్వరం మనసును హత్తుకునేలా ఉండటం ఈ పాట ప్రత్యేకత. అమరగాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, గానకోకిల కె.ఎస్. చిత్ర గాత్రం ఈ పాటకి ప్రాణం పోశాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ గీతం వినగానే తెలియని ప్రశాంతతను అందిస్తుంది.

కవి సమ్రాట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన సాహిత్య విలువలు ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ప్రేమలోని మధురానుభూతిని అత్యంత సున్నితమైన పదాలతో వర్ణించారు. ఇక దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మార్క్ మేకింగ్, కలర్‌ఫుల్ విజువల్స్, వెంకటేష్ – టబుల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డాక్టర్ డి. రామానాయుడు నిర్మించిన ‘కూలీ నెం. 1’ చిత్రం వెంకటేష్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. 1991లో విడుదలైన ఈ సినిమాలోని ఈ పాట దశాబ్దాలు గడిచినా నేటి తరం శ్రోతలను కూడా సమానంగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ క్లాసిక్ సాంగ్ బిట్స్ ఇప్పుడు మరింతగా వైరల్ అవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..

కొత్త కొత్తగా ఉన్నది సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..

Follow Us