వర్షాకాలంలో బెల్లం తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

Samatha

22 July 2026

బెల్లం ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. అందుకే వైద్య నిపుణులు, చక్కెరకు బదులు బెల్లం తినాలని చెబుతుంటారు.

బెల్లం

ముఖ్యంగా ప్రతి రోజూ ఒక చిన్న బెల్లం ముక్క తినడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏవో చూసేద్దాం.

ఆరోగ్య ప్రయోజనాలు

ప్రతి రోజూ బెల్లం తినడం  వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా, దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వాటిని తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తి

జీర్ణక్రియ ఆరోగ్యానికి బెల్లం చాలా మంచిది. ప్రతి రోజూ బెల్లం తినడం వలన ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

మలబద్ధకం సమస్య

ముఖ్యంగా వర్షాకాలంలో బెల్లం తినడం వలన ఇది గ్యాస్, అజీర్తి సమస్యలు తగ్గించి,జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది.

గ్యాస్, అజీర్తి

అంతే కాకుండా ఇది రక్తహీనతను కూడా తరిమికొడుతుంది. బెల్లంలో ఐరన్, ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్త హీనత తగ్గేలా చేస్తుంది.

రక్తహీనత

బెల్లం తినడం వలన శరీరం ఎప్పుడూ వేడిగా ఉంటుంది. అంతే కాకుండా జలుబు రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది.

శరీరంలో వేడి

కాలేయ ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. బెల్లం నేచురల్ డిటాక్సి ఫైయర్‌గా పని చేస్తుంది. కాలేయంలో పేరుకపోయిన విషపదార్థాలను బయటకు పంపుతుంది.

కాలేయ పనితీరు