AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bellam Dosa: అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే కమ్మటి బెల్లం అట్లు.. తినడం మొదలుపెడితే ఆపరు

మన ఇళ్లలో రోజూ ఉదయాన్నే ఏదో ఒక టిఫిన్ చేయడం అలవాటే. అయితే ఎప్పుడూ ఒకే రకమైన ఇడ్లీలు, సాధారణ దోశలు తిని బోర్ కొట్టినప్పుడు, కాస్త భిన్నంగా మరియు తియ్యగా ఏమైనా తినాలనిపిస్తే బెల్లం అట్లు సరైన ఎంపిక. పాతకాలపు సాంప్రదాయ వంటకాల్లో ఒకటైన ఈ బెల్లం అట్లు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన వంటకం.

Phani CH
|

Updated on: Jul 22, 2026 | 9:05 PM

Share
ముఖ్యంగా ఈ అట్లను నానేయడం లేదా రుబ్బడం వంటి శ్రమ లేకుండా అప్పటికప్పుడు కేవలం ఐదు నిమిషాల్లోనే ఎంతో సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ బెల్లం అట్ల తయారీ విధానం చాలా తేలికైనది. ముందుగా ఒక గిన్నెలో అర కప్పు వరిపిండి, ఒక కప్పు గోధుమపిండి తీసుకోండి. అందులోనే అర కప్పు తురిమిన బెల్లం పొడి వేయాలి.

1 / 5
దీనికి తోడు మంచి సువాసన కోసం ముప్పావు టీస్పూన్ యలకల పొడి, అలాగే కమ్మటి ఘాటు కోసం ఒక టీస్పూన్ సొంటి పొడి జత చేయాలి.  ఇప్పుడు తగినన్ని నీళ్లు పోస్తూ బెల్లం పూర్తిగా కరిగే వరకు, అట్ల పిండి మాదిరిగా జారుగా కలుపుకోవాలి. బెల్లం గడ్డలుగా ఉంటే నీళ్లలో కరిగించి వడకట్టి కూడా పిండిలో వేసుకోవచ్చు.

2 / 5
పిండి బాగా కలిసాక రెండు చిటికెల వంటసోడా, రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసి మరోసారి బాగా కలుపుకోవాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం వేడి చేయాలి. పెనాన్ని నెయ్యితో బాగా తుడిచి, గరిటెడు పిండి వేసి పల్చగా అట్లు పోసుకోవాలి. ఈ అట్లకు నూనె కంటే నెయ్యిని వాడితేనే అసలైన కమ్మటి రుచి వస్తుంది.

3 / 5
నెయ్యి వేసి రెండు వైపులా దోరగా, ఎర్రగా కాల్చుకోవాలి. బెల్లం వేయడం వల్ల ఈ అట్లు మంచి ఎరుపు రంగులోకి వస్తాయి. అలాగే ఇందులో వేసిన సొంటి పొడి ఘాటు అక్కడక్కడా తగులుతూ అట్లకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.  ఒకవేళ సొంటి పొడి ఘాటు నచ్చకపోతే దానిని తీసేయవచ్చు. ఈ కమ్మటి బెల్లం అట్లు వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఎంతో మృదువుగా, రుచిగా ఉంటాయి.

4 / 5
వీటిని అల్లం పచ్చడి లేదా కారం తక్కువగా ఉండే కొబ్బరి పచ్చడితో నంజుకుని తింటే ఆ రుచి వేరే లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఈ తీపి అట్లు ఎంతగానో నచ్చుతాయి, మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరి తింటారు.  పైగా ఉడిపి ప్రాంతంలో శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించే ఈ పవిత్రమైన సాంప్రదాయ వంటకాన్ని మీ ఇంట్లో కూడా అప్పటికప్పుడు తయారుచేసి, మీ కుటుంబ సభ్యులకు అందించి ఆ పాతకాలపు మధురమైన రుచులను ఆస్వాదించండి.

5 / 5
Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ

రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ

పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ

ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది

ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!

తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి

ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..

ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ

ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల