Social Media Effect: లైక్స్ కోసం ఇంతకు తెగించావా తల్లీ!
లైక్‌లు, వ్యూస్ కోసం వ్యక్తిగత జీవితంలోని అత్యంత సున్నితమైన క్షణాలను కూడా సోషల్ మీడియాలో పంచుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్న భర్త పక్కన నిలబడి ఓ మహిళ రీల్స్ చేయడం వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కంటెంట్ కంటే కరుణ, మానవత్వం ముఖ్యమని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
డిజిటల్ ప్రపంచంలో లైక్‌లు, వ్యూస్ కోసం అత్యంత వ్యక్తిగత, సున్నితమైన క్షణాలను కూడా ఆన్‌లైన్ కంటెంట్‌గా మార్చేస్తున్నారు. ఈ వికృత సంస్కృతిపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఒక చిన్న వీడియో క్లిప్ ఈ వివాదానికి కారణమైంది. ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన భర్త పక్కన నిలబడి, ఒక మహిళ ట్రెండింగ్ ఆడియోతో వీడియో రికార్డ్ చేస్తున్న దృశ్యం ఆ క్లిప్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో అన్ని ప్లాట్‌ఫామ్‌లలో వేగంగా వ్యాపించడంతో నెటిజన్లు ఆ మహిళపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కష్ట సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న భర్తకు ఆప్యాయత, మానసిక మద్దతు అందించాల్సింది పోయి, చేతిలో కెమెరా పట్టుకుని రీల్స్ చేయడం ఏంటని విమర్శిస్తున్నారు. “జీవితంలోని ప్రతి క్షణం రీల్స్ చేయడం కోసం కాదు” అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు క్లాస్ తీసుకుంటున్నారు. ఈ సంఘటన మానవ ప్రవర్తన, డిజిటల్ సరిహద్దులపై సోషల్ మీడియా చూపిస్తున్న దుష్ప్రభావాన్ని మరోసారి బట్టబయలు చేసింది. కేవలం ఎంగేజ్‌మెంట్‌ల కోసమే ఒకప్పుడు కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే ఉండే సన్నిహిత క్షణాలను బజారున పడేస్తున్నారని విమర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటెంట్ క్రియేషన్ కంటే తోటి మనుషులపై కరుణ, సానుభూతి చూపించడమే ముఖ్యమని ఈ వైరల్ క్లిప్ అందరికీ గుర్తు చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Boy Friend For Rent: గంటల లెక్కన అద్దెకు ప్రియుడు!..సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
Bigg Boss Telugu: బిగ్ బాస్ షురూ.. ‘గంగూలీ’ రాకతో క్రేజ్ మరింత ఎత్తుకు..
Jabardasth: జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్.. రీ ఎంట్రీ.. ఇక పంచ్‌లతో రచ్చ రచ్చే!
Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికీ చిరు నుంచి దిమ్మతిరిగే బర్త్ డే కానుక
లైక్స్ కోసం ఇంతకు తెగించావా తల్లీ!
గంటల లెక్కన అద్దెకు ప్రియుడు!
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే

