Jabardasth: జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్.. రీ ఎంట్రీ.. ఇక పంచ్‌లతో రచ్చ రచ్చే!
దాదాపు 12 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ‘జబర్దస్త్’ షో మళ్లీ పాత జోష్‌ను తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది. నాగబాబు జడ్జిగా రీఎంట్రీ ఇవ్వగా, స్టార్ కమెడియన్ హైపర్ ఆది కూడా పూర్తి స్థాయిలో తిరిగి వస్తున్నాడు. అంతేకాదు, జూలై 26 నుంచి ఈ షో ఆదివారం సాయంత్రం 6 గంటలకు కొత్త టైమ్‌స్లాట్‌లో ప్రసారం కానుంది.
దాదాపు 12 సంవత్సరాలుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న కామెడీ షో జబర్దస్త్. టాప్ రేటింగ్స్ తో తెలుగు టెలివిజన్ రంగంలో తిరుగులేని కామెడీ షోగా గుర్తింపు తెచ్చుకుంది ఈ షో. ఎంతో మంచిదిని స్టార్ కమెడియన్స్ చేసింది. పిల్మ్ ఇండస్ట్రీకి కొత్త తరం కమెడియన్లను అందించడంతో పాటే.. జనాల్ని ఎంటర్‌టైన్ చూస్తూ వస్తోంది ఈ షో. అయితే కాలక్రమంలో ఈ షో నుంచి టాప్ కమెడియన్స్ ఒక్కొక్కరుగా తప్పుకుంటూ వెళ్లిపోవడంతో… ఈ షో కాస్త వెలవెల బోయింది. అదులోనూ ఈ షోకు స్టార్ జడ్జిలుగా వ్యవహించిన రోజా, నాగబాబు లు కూడా బయటికి వెళ్లిపోవడంతో.. మునుపటి రేటింగ్ కూడా తగ్గిపోయింది. అయితే ఇది గమనిస్తూ వస్తున్నీ షో మేకర్స్ ఇప్పుడు రేటింగ్‌ను మళ్లీ పైకి తీసుకెళ్లే ప్రయత్నాలు షురూ చేశారు. ఇందులో భాగంగానే.. రీసెంట్‌గా నాగబాబును మళ్లీ తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు పంచ్ స్టార్ హైపర్ ఆదిని కూడా మళ్లీ ఈ వేదికపైకి తిరిగి తీసుకువస్తున్నారు. ఎస్ ! ఇప్పటికే జడ్జీగా రీ ఎంట్రీ ఇచ్చిన నాగబాబు.. గతంలోలాగే ఫుల్ టైమ్ న్యాయ నిర్ణేతగా కొనసాగనున్నారు. అలాగే గతంలో ఈ షోకు వెన్నెముకగా నిలిచిన స్టార్ కమెడియన్లు సైతం ఈ షోకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాల వల్ల జబర్దస్త్‌కు దూరమైన స్టార్ కమెడియన్ హైపర్ ఆది మళ్లీ రంగంలోకి దిగుతున్నాడు. కేవలం గెస్ట్ అప్పీయరెన్స్ లాగా కాకుండా పూర్తి స్థాయిలో ఈ షోలో పార్టిసిపేట్ చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆదినే వెల్లడించాడు. తాజాగా రిలీజైన జబర్దస్త్ ప్రోమోలోనూ ఆది ఫుల్ ఎనర్జీతో కనిపించాడు. ఇక ఈ జబర్దస్త్ కామెడీ షో కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ షో టెలికాస్ట్ టైమింగ్స్ కూడా మారిపోయాయి. 13 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ జబర్దస్త్ షో మొదట్లో కేవలం గురువారం రాత్రి మాత్రమే వచ్చేది. ఆ తర్వాత ఆడియెన్స్ ఆదరణ పెరగడంతో గురు, శుక్రవారాల్లో ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’గా రూపాంతరం చెందింది. ఆ తరువాత ఈ షోను శుక్ర, శనివారాలకు మార్చేశారు. ఇక ఇప్పుడు ఈ షోను ఏకంగా వీకెండ్ కు మార్చేశారు. అంటే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ జబర్దస్త్ షో స్టార్ట్ కానుంది. జూలై 26 ఎపిసోడ్ నుంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని స్పెషల్ ప్రోమో ద్వారా అధికారికంగా ప్రకటించారు షో నిర్వాహకులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికీ చిరు నుంచి దిమ్మతిరిగే బర్త్ డే కానుక
Balakrishna: బాలయ్య హెల్త్ అప్‌డేట్.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

