AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor: రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? 23 రోజులు వెంటిలేటర్ పై ఉండి..

ఒక్క ఎన్టీఆర్ స్టూడెంట్ నంబర్ వన్ సినిమా మినహా రాజమౌళి తెరకెక్కించిన సినిమాలన్నింటిలోనూ ఈయన నటించారు. కమెడియన్ గా, సహాయక నటుడిగా, కొన్ని సినిమాల్లో విలన్ గానూ నటించి మెప్పించారు. కానీ ఈ టాలీవుడ్ నటుడు ఇప్పుడు మన మధ్య లేరు.

Actor: రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? 23 రోజులు వెంటిలేటర్ పై ఉండి..
Actor Kosuri Venugopal
Basha Shek
|

Updated on: Jul 22, 2026 | 10:02 PM

Share

కోసూరి వేణు గోపాల్.. ఈ పేరు వింటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు.. కానీ పై ఫొటో చూస్తే ఇట్టే గుర్తు పడతారు. గంభీరమైన గొంతు, భారీ కాయంతో కనిపించే ఈయన తన దైన నటనతో తెలుగు ఆడియెన్స్ ను మెప్పించారు. ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా నటించారు వేణు గోపాల్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన కోసూరి చాలా ఏళ్ల పాటు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలో పని చేశారు. అయితే నటననపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సినిమాల్లో యాక్ట్ చేశారు. పి. ఎన్. రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన తెగింపు అనే చిత్రంతో నటుడుగా తన ప్రస్థానం ప్రారంభించారు వేణు గోపాల్. ఆ తర్వాత రాజమౌళి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క స్టూడెంట్ నంబర్ 1 తప్ప మిగతా అన్ని రాజమౌళి సినిమాల్లోనూ కోసూరి నటించడం విశేషం. ముఖ్యంగా మర్యాద రామన్న సినిమాలో బ్రహ్మాజీ తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు వేణు గోపాల్.

ఛత్రపతి, విక్రమార్కుడు, పిల్ల జమీందారు, భలేభలే మగాడివోయ్, అమీతుమీ, ఛలో.. ఇలా దాదాపు 30 సినిమాల్లో నటించారు కోసూరి వేణు గోపాల్. కాగా నటునిగా బిజీగా ఉన్న సమయంలోనే ఈయన కన్నుమూశారు. మహమ్మారి కరోనా కారణంగా కన్నుమూసిన నటుల్లో కోసూరి కూడా ఒకరు. కరోనాతో హైదరాబాదులోని గచ్చిబౌలిలో, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సుమారు 23 రోజుల పాటు వెంటిలేటర్ మీద ఉన్నారు కోసూరి. ఆ తర్వాత కరోనా నెగటివ్ కూడా వచ్చింది. దీంతో కోసూరి కోలుకున్నట్లే కనిపించారు. కానీ అనూహ్యంగా కొద్ది రోజులకే 2020 సెప్టెంబరు 23 న తుదిశ్వాస విడిచారీ సీనియర్ నటుడు.

ఇవి కూడా చదవండి

నాగ శౌర్య కథానాయకుడిగా వచ్చిన ఛలో చిత్రంలో వెన్నెల కిషోర్ తండ్రి పాత్ర పోషించారు కోసూరి వేణుగోపాల్. నటుడిగా ఆయన చివరి చిత్రం ఇదే. ఇక వేణు గోపాల్ విషయానికి వస్తే.. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌