AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Odyssey: ఎందుకన్నా ఇలా చేశావ్‌? ‘ది ఒడిస్సీ’లో పవర్ ఫుల్ రోల్‌ని మిస్ చేసుకున్న మన స్టార్ హీరో ఎవరంటే?

'ది ఒడిస్సీ'.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. ఇండియాలోనే కాదు చివరికీ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా పేరు తెగ మార్మోగుతుంది. తాజాగా ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

The Odyssey: ఎందుకన్నా ఇలా చేశావ్‌? 'ది ఒడిస్సీ’లో పవర్ ఫుల్ రోల్‌ని మిస్ చేసుకున్న మన స్టార్ హీరో ఎవరంటే?
The Odyssey Movie
Basha Shek
|

Updated on: Jul 22, 2026 | 10:00 AM

Share

అనుకున్నట్లే క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అన్ని భాషలకు కలిపి 270 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇండియాలోనూ ఈ సినిమా వసూళ్లు రూ. 100 కోట్లకు చేరువగా ఉండడం ఆసక్తకరమైన విషయం. వీకెండ్ లోనే కాదు వీక్ డేస్ లోనూ ఈ సినిమా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతుండడం విశేషం. హోమర్ రాసిన ప్రఖ్యాత గ్రీకు ఇతిహాసం ‘ఒడిస్సీ’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు క్రిస్టోఫర్ నోలన్. మ్యాట్ డామన్, టామ్ హాలండ్, ఆన్ హ్యాథవే, రాబర్ట్ ప్యాటిన్సన్, చార్లీజ్ థెరాన్, జెండాయా, లుపితా న్యోంగో తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ చిత్రం లో నటించిన అందరి పేర్లు తెగ మార్మోగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ది ఒడిస్సీ నటీనటులుకు మంచి గుర్తింపు వస్తోంది. తాజాగా ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. మన తెలుగు ఆడియెన్స్‌ కు బాగా ఇష్టమైన ఓ హీరోకు ఈ ది ఒడిస్సీ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. అది కూడా ఓ పవర్ ఫుల్ పాత్రలో. అయితే వివిధ కారణాలతో ఈ లక్కీ ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడట ఆ సౌతిండియన్ స్టార్ హీరో.

ది ఒడిస్సీ సినిమాను మిస్ అయిన ఆ స్టార్ హీరో మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ ధనుష్. ‘ది గ్రే మ్యాన్’ చిత్రం లో ధనుష్ నటన ని చూసి దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తన ‘ది ఒడిస్సీ’ సినిమా కోసం ధనుష్ ను సంప్రదించారట. ఏ పాత్ర కోసం తెలియదు కానీ నోలన్ అండ్ టీమ్ ధనుష్ తో మాట్లాడారట. అయితే అప్పటికే తెలుగు , తమిళం , హిందీ సినిమాలతో ధనుష్ బిజీగా ఉన్నాడట. దీంతో క్రిస్టోఫర్ నోలన్ అడిగన డేట్స్ ను ధనుష్ కేటాయించలేకపోయాడట. దీంతో బంగారం లాంటి అవకాశాన్ని అతను వదులుకున్నట్లు అయ్యింది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరలవుతోంది. ఒకవేళ ది ఒడిస్సీలో ధనుష్ చేసి ఉంటే ఆయన రేంజ్ మరోలా ఉండేదని సినిమా విశ్లేషకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

అని తేడా లేకుండా ధనుష్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నారు. దీంతో అయాన్ నోలన్ టీం అడిగినన్ని డేట్స్ కేటాయించలేకపోయారు. ఆ కారణం చేత ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న సినిమాలో ధనుష్ బంగారం లాంటి అవకాశాన్ని వదులుకున్నట్టు అయ్యింది. ఒకవేళ ఈ చిత్రం ఆయన ఒప్పుకొని చేసుంటే , ఆయన రేంజ్ ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ది ఒడిస్సీ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us