AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suman: సినిమా ఇండస్ట్రీలో నేల కింద చూడకుండా డ్యాన్స్ చేయగలిగేది ఆ తెలుగు హీరో మాత్రమే: సుమన్

ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగిన సుమన్ ఇప్పుడు సహాయక నటుడిగా రాణిస్తున్నారు. అప్పుడప్పుడు విలన్ గానూ భయ పెడుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సుమన్ తెలుగు స్టార్ హీరోల డ్యాన్సింగ్ స్కిల్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Suman: సినిమా ఇండస్ట్రీలో నేల కింద చూడకుండా డ్యాన్స్ చేయగలిగేది ఆ తెలుగు హీరో మాత్రమే: సుమన్
Suman
Basha Shek
|

Updated on: Jul 20, 2026 | 9:22 PM

Share

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు సుమన్. ముఖ్యంగా యాక్షన్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా ఉండే వారు. తన కరాటే ఫైట్స్, యాక్షన్ సీన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడం.. ఇలా మొత్తం 10 భాషల్లో సుమారు 700 సినిమాలు చేశారు సుమన్. అయితే స్టార్ హీరోగా ఎదగాల్సిన సుమన్ ఒక కేసు కారణంగా ఇబ్బందుల్లో పడ్డారు. కొన్ని రోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. దీంతో రేసులో వెనకపడిపోయాడు సుమన్. ఆ తర్వాత కూడా సినిమాలు చేసినా క్రేజ్ మాత్రం పెద్దగా రాలేదు. కాగా ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు సుమన్. సహాయక నటుడిగా మెప్పిస్తున్నారు. అలాగే అప్పుడప్పుడు విలన్ గానూ ఆకట్టుకుంటున్నారీ సీనియర్ యాక్టర్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు సుమన్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే క్రమంలో తెలుగు హీరోల డ్యాన్సింగ్ స్కిల్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

‘నార్త్ లో ఎవరున్నారో తెలియదు కానీ.. దక్షిణాది హీరోల విషయానికి వస్తే.. ది బెస్ట్ డ్యాన్సర్ మెగాస్టార్ చిరంజీవినే. ఎందుకంటే.. మీరు గమనిస్తే.. నేల కింద చూడకుండా డ్యాన్స్ చేసే ఏకైక వ్యకి చిరంజీవి గారు. మిగతా హీరోలెవరైనా ఆఖరికి కమల్ హాసన్ కూడా నేల చూసే డ్యాన్స్ చేస్తారు. బట్.. నా దృష్టిలో నేల కింద చూడకుండా.. ఫుట్ వర్క్ బ్రహ్మండంగా చేసే వ్యక్తి వన్ అండ్ ఓన్లీ చిరంజీవి. మ్యూజిక వస్తే.. ఆయన బాడీలో ఒక ఫ్లో, మూమెంట్ వస్తుంది. అది అందరికీ రాదు. అది ఆయనకు దేవుడిచ్చిన వరం. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది డ్యాన్స్ ఉండవచ్చు.. కానీ ఆయన గ్రేస్, రిథమ్ ఎవరికీ రావు. ఇక చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో డ్యాన్స్ చేసేది జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. మోడ్రన్ డ్యాన్స్ అందరూ చేస్తున్నారు. కానీ క్లాసికల్ డ్యాన్స్ మాత్రం కొందరే చేస్తారు. నాకు తెలిసి ఇండస్ట్రీలో చిరంజీవి ఆ తర్వాత తారక్ బెస్ట్ డ్యాన్సర్స్’ అని సుమన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మెగా 158 సినిమాతో బిజీ బిజీగా మెగాస్టార్ చిరంజీవి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పప్పుచారు రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి.. రుచి అద్దిరిపోతుంది!
పప్పుచారు రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి.. రుచి అద్దిరిపోతుంది!
హైదరాబాద్‌లో అర్ధరాత్రి దొంగల హల్‌చల్.. గోడలు దూకి చోరీకి యత్నం!
హైదరాబాద్‌లో అర్ధరాత్రి దొంగల హల్‌చల్.. గోడలు దూకి చోరీకి యత్నం!
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో మరో అప్డేట్..
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో మరో అప్డేట్..
ఒక్క తప్పుతో చేజారిన సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ సిక్సర్ షాట్ వైరల్
ఒక్క తప్పుతో చేజారిన సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ సిక్సర్ షాట్ వైరల్
7.8 శాతం జీడీపీ వృద్ధి.. ప్రధాని మోదీ విధానాలతోనే సాధ్యమైంది!
7.8 శాతం జీడీపీ వృద్ధి.. ప్రధాని మోదీ విధానాలతోనే సాధ్యమైంది!
32 మంది ప్రయాణికులతో వస్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు
32 మంది ప్రయాణికులతో వస్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు
పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరింత బలమైన రక్షణ
పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరింత బలమైన రక్షణ
ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? బర్త్‌డే ఫొటోస్ వైరల్
ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? బర్త్‌డే ఫొటోస్ వైరల్
10వ తరగతి పాసైతే చాలు.. ఇండియా పోస్ట్‌లో 23,757 ఉద్యోగాలు! లింక్
10వ తరగతి పాసైతే చాలు.. ఇండియా పోస్ట్‌లో 23,757 ఉద్యోగాలు! లింక్
అరెరే వాట్సాప్ కాల్ రికార్డ్ చేయడం ఇంత సింపులా? ఇన్నాళ్లు తెలీదే
అరెరే వాట్సాప్ కాల్ రికార్డ్ చేయడం ఇంత సింపులా? ఇన్నాళ్లు తెలీదే